కూతుర్ని అలా చూపించొద్దంటున్న సీనియ‌ర్ న‌టి

కూతుర్ని అలా చూపించొద్దంటున్న సీనియ‌ర్ న‌టి

సినీ ఇండ‌స్ట్రీలో వార‌సులు మామూలే. ఒక న‌టుడి వార‌సులుగా వాళ్ల కొడుకులు దిగ‌టం రోటీన్ వ్య‌వ‌హారం. అదే.. వాళ్ల కూతుళ్లు సీన్లోకి వ‌స్తానంటే మాత్రం స‌ద‌రు న‌టుడి కుటుంబ స‌భ్యులు మొద‌లు ఆ న‌టుడి అభిమానుల వ‌ర‌కూ చాలానే ఆంక్ష‌లు మొద‌ల‌వుతాయి. మ‌రి.. ఇదే మాట‌ను ఆ న‌టుడి కొడుకుల విష‌యంలో వ‌ర్తించ‌దా? అంటే లేద‌నే చెప్పాలి. అందుకే.. న‌టుడి వార‌సులుగా కొడుకులు వ‌చ్చేంత‌గా.. కూతుళ్లు తెర మీద క‌నిపించ‌రు.

ఇలాంటి తీరే బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ బాలీవుడ్ ఎంట్రీలోనూ క‌నిపిస్తుంది. సైఫ్ మొద‌టి భార్య‌.. సీనియ‌ర్ న‌టి అమృతా సింగ్ త‌న కుమార్తె సారా అలీఖాన్‌ బాలీవుడ్ ఎంట్రీ మీద స‌వాల‌చ్చ ఆంక్ష‌లు పెడుతోంద‌ట‌. నిజానికి ఆమె వెండితెర‌కు పరిచ‌యం కావ‌టం అస్స‌లు ఇష్టం లేద‌ట‌.

అయితే.. సినిమాల మీద సారాకు ఉన్న మోజును కాద‌న‌లేక చివ‌ర‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌. అయితే.. ఇందుకు కొన్ని కండీష‌న్లు పెట్టార‌ట‌. సినిమాలు అంటే సినిమాల్లో ప‌ని చేయ‌ట‌మే త‌ప్పించి.. పార్టీలు.. స్నేహితులు అంటూ ఇష్టారాజ్యంగా ఉంటే కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పార‌ట‌. ప‌ని మీద దృష్టి పెట్టాల్సిందే త‌ప్పించి.. మిగిలిన విష‌యాల మీద ఫోక‌స్ పెడితే బాగోద‌న్న విష‌యాన్ని క‌రాఖండిగా చెప్పార‌ట‌.

అన్నింటికి మించి తెర మీద కూతుర్నిగ్లామ‌ర్ డోస్ విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని.. సెక్సీ లుక్స్ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని.. అలాంటివేమీ క‌నిపించ‌కూడ‌ద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టంగా చెప్పార‌ట‌. ప్ర‌స్తుతం కేదార్ నాథ్ మూవీలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో క‌లిసి జోడీ క‌డుతున్న సారా విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకోవాల‌ని ద‌ర్శ‌కుడు అభిషేక్ క‌పూర్‌కు  ప‌దే ప‌దే చెప్పార‌ట‌. అదే స‌మ‌యంలో యాక్టింగ్ విష‌యంలోనూ పాఠాలు నేర్పాల్సిన భారాన్ని కూడా డైరెక్ట‌ర్ మీద‌నే పెట్టేశార‌ట‌. చూస్తుంటే.. ద‌ర్శ‌కుడికి సినిమా మీద కంటే సారా విష‌యాల మీద ఎక్కువ దృష్టి పెట్టాల‌న్న‌ట్లుగా ఉంది క‌దూ..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English