సెన్సార్ బోర్డుపై ఆమిర్ ఫైర్‌!

సెన్సార్ బోర్డుపై ఆమిర్ ఫైర్‌!

ప్ర‌స్తుతం బాలీవుడ్ లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) డైరెక్ట‌ర్ పహ్లాజ్ నిహ్లానీ పేరు మారు మోగిపోతున్న సంగ‌తి తెలిసిందే. న‌వాజుద్దీన్ సిద్దిఖీ హీరోగా నటించిన ‘బాబుమోషాయ్ బందూక్‌బాజ్’ కు ఏకంగా 48 క‌ట్లు విధించ‌డ‌మే కాకుండా ఆ సినిమాకు ఏ స‌ర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ స‌భ్యులు. పైగా, ఆ చిత్ర నిర్మాత కిర‌ణ్ ష్ర‌ఫ్ వేష ధార‌ణ‌పై వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు చేశారనే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆడ‌దానివై ఉండి ఇటువంటి సినిమా తీస్తావా అంటూ త‌న‌ను సెన్సార్ స‌భ్యులు దూషించార‌ని ష్ర‌ఫ్ ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. గ‌త కొద్ది రోజులుగా నిహ్లానీ తీసుకుంటున్న‌ వివాదాస్పద నిర్ణయాలపై బాలీవుడ్ మండిప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ సెన్సార్ బోర్డుపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశాడు.


తాజాగా సెన్స‌ర్ బోర్డు తీరుపై  బాలీవుడ్ సూపర్ స్టార్, మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్‌ ఆమిర్ ఖాన్ ధ్వ‌జ‌మెత్తాడు. సెన్సార్ బోర్డు నిర్ణ‌యాల‌ను దుయ్య‌బ‌ట్టాడు.  సెన్సార్ బోర్డుపై ఆమిర్ ఖాన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. బోర్డు తనపని తాను చేసుకుంటే మంచిదని ఆమిర్ అభిప్రాయ‌ప‌డ్డాడు. బోర్డు పని కేవ‌లం సర్టిఫికెట్ ఇవ్వడం మాత్రమేనని, ఆ పనిచేసుకుని సెన్సార్ సంగతి తమకు వదిలేయాని తీవ్రస్థాయిలో వ్యాఖ్య‌లు చేశాడు. ‘సీక్రెట్ సూపర్‌స్టార్’  సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో ఆయ‌న మాట్లాడాడు.

త‌న‌కు తెలిసినంత వరకు సెన్సార్ బోర్డు పని సర్టిఫికెట్ ఇవ్వడం వరకేన‌ని, సెన్సార్ చేయడం కాద‌ని ఆమిర్ అన్నాడు. సినిమాలకు గ్రేడ్ ఇవ్వడం వ‌ర‌కే సెన్సార్ ప‌ని అని చెప్పాడు. శ్యాం బెనగల్ ప్రతిపాదనలు ఆ విషయాన్నే చెబుతున్నాయని గుర్తు చేశాడు. త్వరలోనే సినిమాల సెన్సార్ల విష‌యంలో పరిస్థితులు చక్కబడతాయన్న ఆశాభావాన్ని ఆమిర్ వ్యక్తం చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు