బాలయ్య 102.. కొన్ని ముచ్చట్లు

బాలయ్య 102.. కొన్ని ముచ్చట్లు

నిన్నో మొన్నో మొదలైనట్లుగా ఉంది నందమూరి బాలకృష్ణ-పూరి జగన్నాథ్‌ల 'పైసా వసూల్'. కానీ శరవేగంగా ఆ సినిమాను పూర్తి చేసేసిన బాలయ్య.. ఇంతలోనే తన కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టేశాడు. తమిళ సీనియర్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్ర ప్రారంభోత్సవం సందర్భంగా తన అసిస్టెంటును బాలయ్య కొట్టిన వీడియో బయటికి రావడంతో దీనికి మంచి పబ్లిసిటీనే లభించింది. ఈలోపు ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విశేషాలు బయటికి వచ్చాయి.

ఈ సినిమా కోసం నయనతారను కథానాయికగా ఎంచుకున్నట్లుగా వచ్చిన వార్తలు వాస్తవమే అని రూఢి అయింది. సింహా, శ్రీరామరాజ్యం తర్వాత బాలయ్య-నయన్ కలిసి మరోసారి నటించబోతున్నారు. ఐతే ఇందులో ఇంకో ఇద్దరు హీరోయిన్లకు కూడా చోటుందట. వాళ్ల పేర్లు త్వరలోనే ప్రకటిస్తారట. రాజమౌళి సినిమాలు 'విక్రమార్కుడు', 'ఛత్రపతి', 'మగధీర'లతో పాటు బాలయ్య సినిమాలు 'సింహా', 'లెజెండ్', 'డిక్టేటర్'లకు పని చేసిన రత్నం ఈ చిత్రానికి కథ అందిస్తుండటం విశేషం.

ముందు కె.ఎస్.రవికుమార్‌తో సినిమా చేయడానికి కమిటైన బాలయ్య.. ఆ తర్వాత రత్నంను కలిసి తమ కాంబినేషన్లో అదిరిపోయే సినిమా రావాలని.. అందుకు తగ్గ కథ తయారు చేయమని చెప్పాడట. అనేక కథలు అనుకున్నాక చివరికి ఓ అద్భుతమైన కథ తయారైనట్లు రత్నం తెలిపాడు.

ఈ చిత్ర షూటింగ్ సగ భాగం తమిళనాడులో జరగబోతుండటం విశేషం. కుంభకోణం ప్రాంతంలో 40 రోజుల పాటు ఏకధాటిగా ఒక షెడ్యూల్ ఉంటుంది. 'కంచె'తో పాటు బాలయ్య చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి సంగీతం అందించిన చిరంతన్ భట్ ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈ సినిమాకు 'జయసింహా' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English