బాహుబలితో సత్తా తెలిసొచ్చిందన్న అమీర్

బాహుబలితో సత్తా తెలిసొచ్చిందన్న అమీర్

గత దశాబ్ద కాలంలో అమీర్ ఖాన్ ఇంతింతై.. అన్నట్లుగా ఎదిగిపోయాడు. ఇండియన్ సినిమాను ఎంతో గొప్ప స్థాయికి తీసుకెళ్లాడు. కంటెంట్ విషయంలోనే కాదు.. కలెక్షన్ల విషయంలోనూ అమీర్ సినిమాలు భారతీయ చిత్ర పరిశ్రమ స్థాయిని తీసుకెళ్లాయి. ఐతే సినిమా సినిమాకూ తన ఇమేజ్‌ను పెంచుకుంటున్నప్పటికీ.. అమీర్ ఎప్పుడూ తన గురించి.. తన సినిమాల గురించి గొప్పలు చెప్పుకోడు. వేరే వాళ్లను.. వేరే సినిమాలను తక్కువ చేసి మాట్లాడడు.

ప్రాంతీయ సినిమాగా మొదలై.. దేశమంతటా వసూళ్ల వర్షం కురిపించిన 'బాహుబలి' విషయంలోనూ అమీర్ చేసిన కామెంట్లు అతడి ప్రత్యేకతను తెలియజేస్తాయి. 'బాహుబలి'ని చూసి బాలీవుడ్ వాళ్లు పాఠాలు నేర్చుకోవాలంటూ చాలామంది దెప్పిపొడుపు మాటలు మాట్లాడుతుంటే.. దాన్ని మరో రకంగా తీసుకోలేదు అమీర్. ఈ మాట వాస్తవమే అని అంగీకరించాడు.

'బాహుబలి-2' హిందీ సినిమాలకు ఉన్న సత్తా ఏంటో తమకు తెలిసొచ్చేలా చేసిందని.. దాన్నుంచి తాము కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉందని అమీర్ ఖాన్ అన్నాడు. 'బాహుబలి' సాధించిన విజయం భారతీయ చిత్ర పరిశ్రమకు ఎంతో మేలు చేసేదే అని అమీర్ వ్యాఖ్యానించాడు.

మరోవైపు తనతో పోల్చి సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌‌లను ఓ విలేకరి తక్కువ చేసి మాట్లాడగా.. దాన్ని తప్పుబట్టాడు అమీర్. ఒకట్రెండు సినిమాలు ఫ్లాపైనంత మాత్రాన వాళ్లను తక్కువగా అంచనా వేయొద్దని.. వాళ్లు మళ్లీ తమ స్టామినా ఏంటో చూపిస్తారని అమీర్ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు