తాప్సీ ఓ ఇంటిదయింది

తాప్సీ ఓ ఇంటిదయింది

కొబ్బరికాయ వివాదంతో వార్తల్లో నానిన తాప్సీ ఆ వివాదాన్ని పక్కనపెట్టి సొంత ఇంటి ఆనందాన్ని ఆస్వాదిస్తోంది. ఎన్నాళ్లగానో కలలు కంటోన్న సొంత ఇంటిని ఆమె ముంబయిలో సొంతం చేసుకుంది. బాంద్రా ఏరియాలో విలాసవంతమైన మూడున్నర బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌ని తాప్సీ కొనుగోలు చేసింది. ఇందులో తాప్సీతో పాటు ఆమె చెల్లెలు షగున్‌ పన్ను వుంటుందట.

అక్క షూటింగ్స్‌తో బిజీగా వుంటే, ఈ ఫ్లాట్‌ ఇంటీరియర్‌ బాధ్యతలు షగున్‌ చూసుకుంటోందట. ముప్పయ్‌ ఏళ్లు నిండేలోగా కారు, ఇల్లు కొనుక్కోవడంతో పాటు కెరియర్‌ని ఒక దారికి తెచ్చుకోవాలని తాప్సీ గోల్‌గా పెట్టుకుందట. దానిని సాధించానని ఆమె ఆనందపడుతోంది. కోట్ల విలువ చేసే ఈ ఫ్లాట్‌ని తాప్సీ పైసా లోన్‌ తీసుకోకుండా కొనేసిందట.

లోన్స్‌ పెట్టుకుని ఒత్తిడి అనుభవించడం ఇష్టం లేదని, అందుకే లోన్‌ లేకుండా ఇల్లు కొనడం కోసం ఇంతకాలం వేచి చూసానని ఆమె చెప్పింది. గతంలోనే ఆమె ఢిల్లీలో ఒక ఫ్లాట్‌ కొనేసింది కానీ దానిని కేవలం ఇన్వెస్ట్‌మెంట్‌ కోసమే తీసుకుందట. ముంబయిలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనే లక్ష్యాన్ని సాధించడంతో తాప్సీ త్వరలోనే ఈ ఆనందాన్ని తన కుటుంబ సభ్యులతో కలిసి నెల రోజులు పంచుకోనుంది. గృహ ప్రవేశం తర్వాత నెల రోజుల పాటు ఏకధాటిగా ఈ ఇంటిలో సంబరాలు చేసుకుంటారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English