పవన్‌ చేస్తాడు కానీ కండిషన్స్‌ అప్లయ్‌

పవన్‌ చేస్తాడు కానీ కండిషన్స్‌ అప్లయ్‌

త్రివిక్రమ్‌తో చేస్తోన్న సినిమానే పవన్‌కళ్యాణ్‌ చివరి చిత్రమనే ప్రచారం జోరుగా జరుగుతోంది. పవన్‌ కళ్యాణ్‌ మాటలు కూడా దానినే సూచించడంతో పవన్‌ లాస్ట్‌ ఫిలిం అంటూ మీడియా ఊదరగొట్టేస్తోంది.

అయితే నటనకి పూర్తిగా స్వస్తి చెప్పడానికి పవన్‌ ఇష్టపడడం లేదని, ఎన్నికల వరకు సినిమాలకి కాస్త సమయం కేటాయించాలని భావిస్తున్నాడని, ఎన్నికల తర్వాత కెరియర్‌పై ఒక నిర్ణయానికి వస్తాడని విశ్వసనీయ సమాచారం. డిసెంబర్‌ నుంచి ప్రతి నెలలో పది, పదిహేను రోజులు షూటింగ్‌కి కేటాయించడానికి పవన్‌ సిద్ధమట. అందుకు ఓకే అనుకున్న నిర్మాతలకి డేట్స్‌ ఇస్తాడట. దీనికి ఏ నిర్మాత అయినా ఓకే చెప్పినట్టయితే ఎన్నికలలోగా పవన్‌ నుంచి మరో సినిమా వస్తుందన్నమాట. ప్రస్తుతానికి పవన్‌కి ముగ్గురు నిర్మాతలు అడ్వాన్స్‌లు ఇచ్చారు.

వీరిలో ఎవరైతే ఈ లిమిటెడ్‌ డేట్స్‌కి అంగీకరిస్తారో వారితోనే పవన్‌ తదుపరి చిత్రం వుంటుంది. ఒకవేళ దీని వల్ల షూటింగ్‌ ఆలస్యమవుతుందనే భయం నిర్మాతలకి వున్నట్టయితే ఎన్నికల లోగా పవన్‌ సినిమా ఇంకేదీ రాదు. అలాగని ఎలక్షన్స్‌ తర్వాత పవన్‌ సినిమాలు చేయడనేమీ లేదు. చిరంజీవి మాదిరిగా సినిమాలకి పూర్తిగా గుడ్‌బై చెప్పి ఎన్నికల బరిలోకి వెళ్లాలని పవన్‌ అనుకోవడం లేదు కనుక లాస్ట్‌ మూవీ అంటూ ఫాన్స్‌ కంగారు పడనక్కర్లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు