మెగా హీరోకి చెమటలు పడుతున్నాయి

మెగా హీరోకి చెమటలు పడుతున్నాయి

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా నిలదొక్కుకున్నాడు కానీ ఈమధ్య కాలంలో అతనికి టైమ్‌ కలిసి రావడం లేదు. అతని గత చిత్రాలు దారుణంగా ఫ్లాప్‌ అవడంతో సాయి ధరమ్‌ తేజ్‌ చిక్కుల్లో పడ్డాడు. వరుణ్‌ తేజ్‌ 'ఫిదా'తో పెద్ద హిట్‌ కొట్టడంతో ధరమ్‌ తేజ్‌పై మరింత ఒత్తిడి పెరిగింది.

ఈ నేపథ్యంలో అతను కీలక పాత్ర పోషించిన 'నక్షత్రం' రేపు రిలీజ్‌ అవుతోంది. ఈ చిత్రంలో సాయి ధరమ్‌ తేజ్‌ చేసింది అతిథి పాత్రే అయినప్పటికీ అతడిని మార్కెటింగ్‌ కోసం బాగా వాడుకుంటున్నారు. దీంతో ఈ చిత్రాన్ని సందీప్‌ కిషన్‌ సినిమాలా కాకుండా, ఇద్దరు హీరోల సినిమాలా ట్రీట్‌ చేస్తున్నారు.

కృష్ణవంశీ రీసెంట్‌ ఫామ్‌ చూసినా, నక్షత్రం ప్రోమోలు చూసినా కానీ ఈ చిత్రం పట్ల ఎలాంటి నమ్మకాలు ఏర్పడడం లేదు. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ చాలా వీక్‌గా వుండడాన్ని బట్టి దీనిపై ప్రేక్షకులకి ఆసక్తి లేదనేది అర్థమవుతోంది. అయితే ఈ చిత్రం తనకి ఎక్కడ మైనస్‌ అవుతుందోనని సాయిధరమ్‌ తేజ్‌ కంగారు పడుతున్నాడు.

ఈ సినిమా ఫ్లాప్‌ అయితే తనని ఎంతవరకు నిందిస్తారు, ఈ ఫ్లాప్‌ని తనకి ఏమాత్రం అంటగడతారు అంటూ తేజ్‌ టెన్షన్‌గా ఎదురు చూస్తున్నాడు. వినిపిస్తోన్న ప్రీ రిలీజ్‌ టాక్‌కి అతీతంగా నక్షత్రం హిట్‌ అయితే తేజ్‌ హ్యాపీనే కానీ, ఇది కానీ మిస్‌ఫైర్‌ అయి తనకి బ్యాడ్‌నేమ్‌ వస్తే తదుపరి రాబోయే 'జవాన్‌' మీద దాని ప్రభావం పడుతుందనేది అతని భయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు