లై ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కు ప్రిన్స్‌!

లై ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కు ప్రిన్స్‌!

టాలీవుడ్ లో యంగ్ డైరెక్ట‌ర్ హను రాఘవపూడికి ఓ స్పెషాలిటీ ఉంది. అందాల రాక్ష‌సి, కృష్ణ‌గాడి వీర ప్రేమ గాథ వంటి సినిమాల‌తో వ‌రుస హిట్ లు కొట్టాడు. చేసింది రెండు సినిమాల‌తోనే దర్శకుడిగా త‌నను తాను ప్రూవ్ చేసుకున్నాడు. త‌న సినిమాల్లో వైవిధ్యం, ప్ర‌త్యేక‌త ఉంటుంద‌ని ప్రేక్ష‌కుల‌ను క‌న్విన్స్ చేశాడు. హను రాఘవపూడి ద‌ర్శ‌క‌త్వంలో నితిన్ హీరోగా తెరెక్కిన లై చిత్రం ఈ నెల 11న‌  ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇప్ప‌టికే టై ట్రైల‌ర్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయాల‌ని నిర్మాత‌లైన‌ 14 రీల్స్ సంస్థ వారు అనుకున్నార‌ట‌. ఈ ఫంక్షన్ కు సెంట‌ర్ ఆఫ్ ఎట్రాక్ష‌న్ గా ప్రిన్స్ మ‌హేశ్ బాబుని ఇన్వైట్ చేయాలనుకుంటున్నార‌ట‌. లై సినిమాకు మ‌రింత హైప్ క్రియేట్ చేయ‌డానికి మహేశ్ బాబును ముఖ్య అతిథిగా రావాల‌ని రిక్వెస్ట్ చేశారట.

14 రీల్స్ బ్యాన‌ర్ లో మ‌హేశ్‌...దూకుడు, ఆగ‌డు సినిమాలు చేశాడు. వారితో మహేశ్  మంచి అనుబంధం ఉంది. దీంతో, ఆ ఫంక్ష‌న్ కు మ‌హేశ్ త‌ప్ప‌కుండా వ‌స్తార‌ని టాలీవ‌డ్ టాక్‌. ప్ర‌స్తుతం స్పైడ‌ర్ షూటింగ్ లో బిజీగా ఉన్న మ‌హేశ్ ఎవైల‌బిటిటీని బ‌ట్టి ఫంక్ష‌న్ డేట్ ఫిక్స్ చేసేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారట. సో, లై ప్రీ రిలీజ్ డేట్ ఫంక్షన్ డేట్ ను మ‌హేశ్ డిసైడ్ చేయబోతున్నార‌న్న‌మాట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు