బాల‌య్య 102వ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌!

బాల‌య్య 102వ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌!

నందమూరి నటసింహం బాలకృష్ణ, పూరీ జ‌గ‌న్నాథ్ క్రేజీ కాంబోలో తెర‌కెక్కిన చిత్రం పైసా వ‌సూల్‌. సెప్టెంబ‌రు1 న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఆగ‌స్టు 17 న ఈ పైసా వ‌సూల్ ఆడియో ఫంక్ష‌న్ ఖ‌మ్మంలోని ఎస్. ఆర్. అండ్ బి.జి.ఎన్.ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని పూరీ అనుకున్న దానికంటే నెల రోజుల ముందుగానే పూర్తి చేశాడు. ఈ సినిమా షూటింగ్ అనుకున్న స‌మ‌యానికంటే ముందే పూర్త‌వ‌డంతో బాల‌య్య త‌న 102 వ చిత్రం షూటింగ్ ప్రారంభించాడు.

బాల‌య్య 102వ చిత్రం షూటింగ్ కొద్దిసేప‌టి క్రితం అధికారికంగా ప్రారంభమైంది. ముహూర్తపు షాట్ కు దర్శకుడు బోయపాటి శ్రీను క్లాప్ కొట్టారు.ఈ చిత్రానికి కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సీ.కల్యాణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, అశుతోష్ రాణాలతో పాటు పంజాబ్ చిత్ర సీమలో టాప్ హీరోగా ఉన్న నటుడు విలన్ గా నటించనున్నాడు.

మొద‌ట్లో ఈ సినిమాకు  'రెడ్డిగారు' అన్న టైటిల్ పెట్ట‌బోతున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఈ మూవీకి 'జయసింహ అనే టైటిల్ ఫిక్స్ అయిన‌ట్లు తెలుస్తోంది. చిత్ర ప్రారంభోత్సంలో డైరెక్టర్ క్రిష్, ఎస్వీ కృష్ణారెడ్డి, అంబిక కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నెలాఖరు వరకూ రామోజీ ఫిల్మ్ సిటీలో, ఆపై తమిళనాడులోని కుంభకోణంలో ,ఆ తరువాత వైజాగ్, హైదరాబాద్ లో సినిమా షూటింగ్ పూర్తి చేస్తామ‌ని   సీ.కల్యాణ్  చెప్పారు.  ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలుపుతామని సీ.క‌ల్యాణ్ అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English