యూనిట్ స‌భ్యుల‌కు స్టార్ హీరో షాకింగ్ గిఫ్ట్‌!

యూనిట్ స‌భ్యుల‌కు స్టార్ హీరో షాకింగ్ గిఫ్ట్‌!

త‌మ‌కు హిట్ సినిమాలు అందించిన ద‌ర్శ‌కుల‌కు కొంత‌మంది హీరోలు బ‌హుమ‌తులు అందిస్తుంటారు. శ్రీ‌మంతుడు ఘ‌న‌విజ‌యం సాధించిన త‌ర్వాత ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌కు ప్రిన్స్ మ‌హేశ్ బాబు ఆడీ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. అయితే, కోలీవుడ్ స్టార్ హీరో రూటే సెప‌రేటు. త‌న సినిమా యూనిట్ స‌భ్యుల‌కు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వ‌డం విజ‌య్ కు అల‌వాటు. గ‌తంలో పులి సినిమా సంద‌ర్భంగా 265 మంది యూనిట్ స‌భ్యుల‌కు బంగారు నాణేలు గిఫ్ట్‌గా ఇచ్చాడు విజ‌య్‌. అదే త‌ర‌హాలో విజ‌య్ మ‌రోసారి త‌న తాజా చిత్ర యూనిట్ స‌భ్యుల‌కు బంగారు నాణేలు బ‌హుమ‌తిగా ఇచ్చాడు.

విజ‌య్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మెర్సల్. అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ పై భారీ అంచ‌నాలున్నాయి. మెర్సల్ మూవీకి పనిచేసిన దాదాపు 200 మంది టెక్నీషియ‌న్లు, అసిస్టెంట్ టెక్నీషియ‌న్లు, యూనిట్ స‌భ్యుల‌కు విజ‌య్ బంగారు నాణేలను కానుకగా ఇచ్చాడు. విజ‌య్ ఇచ్చిన గిఫ్ట్ తో యూనిట్ స‌భ్యులు తెగ సంతోష‌ప‌డుతున్నార‌ట‌.

మెర్స‌ల్‌ సినిమాలో విజయ్ సరసన కాజల్, సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా. ద‌ర్శ‌కుడు ఎస్ జే సూర్య ఓ కీల‌క‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం స‌మ‌కూరుస్తున్నాడు. ఆగ‌స్టు 20 న ఈ  చిత్రం ఆడియోను విడుద‌ల చేయ‌నున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 17 న ఈ సినిమాను విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు