బన్నీ సినిమాపై స్టార్ డైరెక్టర్ ఏమన్నాడంటే..

బన్నీ సినిమాపై స్టార్ డైరెక్టర్ ఏమన్నాడంటే..

అల్లు అర్జున్ 'సరైనోడు' రిలీజయ్యాక 'దువ్వాడ జగన్నాథం'కు రెడీ అవుతూ.. దీని తర్వాత తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. చెన్నైలో ఓ పెద్ద వేడుక ఏర్పాటు చేసి ఈ సినిమాను ఘనంగా ప్రకటించారు. జ్నానవేల్ రాజా 'స్టూడియో గ్రీన్' బేనర్ మీద తమిళం-తెలుగు భాషల్లో ఒకేసారి ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలిపాడు.

ఐతే ఈ ప్రకటనే తప్ప.. ఈ సినిమా దిశగా అడుగులేమీ ముందుకు పడినట్లు కనిపించలేదు. ముందు అనుకున్న ప్రకారమైతే 'డీజే' పూర్తవగానే బన్నీ ఈ సినిమానే మొదలుపెట్టాలి. కానీ అతనేమో వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య' అనౌన్స్ చేశాడు. ఆ సినిమాను త్వరలోనే మొదలుపెట్టేస్తున్నాడు కూడా. లింగుస్వామితో సినిమా గురించి బన్నీ ఎక్కడా మాట్లాడకపోవడంతో ఆ సినిమా ఆగిపోయినట్లే అనుకున్నారంతా.

కానీ బన్నీతో తాను కచ్చితంగా సినిమా చేస్తానని అంటున్నాడు లింగుస్వామి. ఓ తమిళ ఛానెల్ ఇంటర్వ్యూలో లింగుస్వామి మాట్లాడుతూ.. బన్నీతో సినిమా వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే మొదలవుతుందని చెప్పాడు. ప్రస్తుతం తాను విశాల్ హీరోగా 'పందెం కోడి' సీక్వెల్ చేస్తున్నానని.. ఇదయ్యాక బన్నీతో సినిమా ఉంటుందని వెల్లడించాడు. ఆ సినిమాకు స్క్రిప్టు కూడా ఓకే అయిందని.. హీరోయిన్ వేట కూడా సాగుతోందని చెప్పాడు లింగుస్వామి. మరి బన్నీ కూడా లింగుస్వామి లాగే ఈ ప్రాజెక్టుపై పాజిటివ్‌గా ఉన్నాడో లేదో తెలియాల్సి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు