ముప్పయ్‌ కోట్లు దాటేసిన ఫిదా

ముప్పయ్‌ కోట్లు దాటేసిన ఫిదా

ఫిదా నిన్నటితో ముప్పయ్‌ కోట్ల మార్కు దాటేసింది. ఆదివారంతో ఇరవై తొమ్మిదిన్నర కోట్ల షేర్‌ ఆర్జించిన ఫిదా సోమవారం ఒక్క నైజాంలోనే యాభై లక్షలకి పైగా షేర్‌ రావడంతో ముప్పయ్‌ కోట్ల లాంఛనం పూర్తయింది. తొలి రోజు వినిపించిన సూపర్‌హిట్‌ టాక్‌కి ముప్పయ్‌ కోట్ల షేర్‌ గ్యారెంటీ అనిపించింది.

అయితే కేవలం పదకొండు రోజుల్లోనే ఫిదా ఆ మార్కు దాటేయడంతో ఇప్పుడు మరో అయిదు కోట్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది. పద్ధెనిమిది కోట్ల వాల్యుయేషన్‌తో అమ్మిన ఈ చిత్రం రెండింతలు లాభాలు చేసుకోవడం గ్యారెంటీ. వరుణ్‌ తేజ్‌కి మొదటి విజయంతోనే సరాసరి ముప్పయ్‌ కోట్ల క్లబ్‌లో స్థానం దక్కింది. ఇంకా రవితేజ, గోపిచంద్‌, నాగచైతన్యలాంటి హీరోలే అందుకోలేకపోయిన ఘనత ఇది.

నైజాంలో ఈ చిత్రం అద్భుతంగా రన్‌ అవుతోంది. ఆదివారం తర్వాత మల్టీప్లెక్సుల్లో షోలు పెంచారంటేనే డిమాండ్‌ ఎలా వుందనేది అర్థం చేసుకోవచ్చు. మరిన్ని వసూళ్లు సాధించి నలభై కోట్ల వరకు రీచ్‌ అవడం సాధ్యమే అనుకోవచ్చు కానీ చాలా కొత్త చిత్రాలు వస్తుండడం వల్ల ఆ మార్కుకి ఇవతలే ఆగిపోవచ్చునని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి.

యుఎస్‌లో కూడా రెండు మిలియన్‌ డాలర్ల మార్కుని చేరుకుంటుందా లేదా అనేదే ఆసక్తిగా మారింది. అమెరికాలో రెండవ వారంలో బాహుబలి తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన ఘతన ఫిదా దక్కించుకుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు