క్రేజ్‌ లేని డైరెక్టర్‌!

క్రేజ్‌ లేని డైరెక్టర్‌!

సుకుమార్‌ ప్రొడక్షన్‌లో వచ్చిన మొదటి సినిమా 'కుమారి 21 ఎఫ్‌' సూపర్‌హిట్‌ అయింది. అడల్ట్‌ కంటెంట్‌కి తోడు దేవిశ్రీప్రసాద్‌ పాటలు, రత్నవేలు సినిమాటోగ్రఫీ వగైరా అంశాలు కలిసి వచ్చి ఆ చిత్రాన్ని యూత్‌కి దగ్గర చేసాయి. అదే బ్యానర్‌ నుంచి వస్తోన్న రెండవ సినిమా 'దర్శకుడు'.

సుకుమార్‌ అన్న తనయుడు అశోక్‌ హీరోగా నటించిన ఈచిత్రం ప్రోమోస్‌ ఆకర్షణీయంగానే వున్నాయి కానీ టెక్నికల్‌ టీమ్‌ స్ట్రాంగ్‌గా లేకపోవడం, హీరో కొత్తవాడు కావడంతో క్రేజ్‌ రావడం లేదు. అయితే కథపై అపారమైన నమ్మకం వుండడంతో సుకుమార్‌ ఇది ఖచ్చితంగా పెద్ద హిట్‌ అవుతుందని నమ్ముతున్నాడు. సినిమాకి క్రేజ్‌ తేవడం కోసం, అందరు హీరోల అభిమానులని ఆకర్షించడం కోసం ప్రతి ఈవెంట్‌కీ ఒక పెద్ద స్టార్‌ని తీసుకొస్తున్నాడు.

చరణ్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో తలా ఒక చెయ్యి వేసారు. అయినప్పటికీ శుక్రవారం విడుదలకి రెడీ అవుతోన్న ఈ చిత్రంపై ఎలాంటి క్రేజ్‌ లేదు. విడుదలైన తర్వాత వచ్చే టాక్‌ని బట్టి కలక్షన్లు పుంజుకుంటాయేమో చూడాలి. కుమారి 21 ఎఫ్‌ చిత్రానికి విడుదలకి ముందే పిచ్చ క్రేజ్‌ వచ్చేసింది.

కానీ పోస్టర్‌ వేల్యూ లేకపోవడంతో దర్శకుడు ప్రస్తుతానికి నీరసంగా కనిపిస్తోంది. నక్షత్రంతో పోటీగా రావడం వల్ల ఇది సస్టెయిన్‌ అవ్వాలంటే పబ్లిక్‌ టాక్‌ పాజిటివ్‌గా వుండడం తప్పనిసరి. ఆగస్టు 11న చాలా చిత్రాలు విడుదల కానుండడంతో నెమ్మదిగా పుంజుకునే వీలు కూడా లేదు మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు