తమిళ మెగా మూవీ రిలీజ్ డేట్ మారింది

తమిళ మెగా మూవీ రిలీజ్ డేట్ మారింది

తమిళంలో ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ అంటే.. 'వివేగం' అనే చెప్పాలి. 'తల' అజిత్.. అతడితో ఒకటికి రెండు సూపర్ హిట్లు (వీరం, వేదాలం) ఇచ్చిన శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. వీళ్ల కాంబోలో హ్యాట్రిక్ మూవీ కోసం అజిత్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది.

రెండు నెలల కిందట విడుదలైన 'వివేగం' ట్రైలర్ ప్రకంపనలు రేపింది. యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగించింది. ముందు అనుకున్న ప్రకారం ఆగస్టు 10న 'వివేగం' విడుదల కావాల్సింది. నిన్న సెన్సార్ కూడా పూర్తవడంతో ఇండిపెండెన్స్ డే వీకెడ్లో అజిత్ రచ్చ ఖాయం అనుకున్నారు. కానీ కారణాలేంటో తెలియదు కానీ.. సినిమా విడుదలకు రెడీగా ఉన్నప్పటికీ వాయిదా వేసేశారు. ఆగస్టు 24న 'వివేగం'ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

దీంతో 'వివేగం' ఆగస్టు 10నే వస్తుందనుకుని దానికి తగ్గట్లుగా రిలీజ్ డేట్లు ప్లాన్ చేసుకున్న వాళ్లందరూ ఇప్పుడు అత్యవసరంగా మార్పులు చేసుకుంటున్నారు. ఆగస్టు 24కు అనుకున్న ధనుష్ మూవీ 'వీఐపీ-2'ను 4న లేదా 11న విడుదల చేద్దామనుకుంటున్నారు. ఇంకా పలు సినిమాల విడుదల తేదీలు మారుతున్నాయి. రానా సినిమా 'నేనే రాజు నేనే మంత్రి' తమిళ వెర్షన్ 'నాన్ ఆనైయిటాల్'ను తెలుగుతో పాటే ఆగస్టు 11నే తమిళంలో కూడా రిలీజ్ చేసుకోవడానికి మార్గం సుగమమైంది.

11న తెలుగులో ఒకటికి మూడు సినిమాలొస్తున్న నేపథ్యంలో 'వివేగం' తెలుగు వెర్ష‌న్‌ను ఎలా రిలీజ్ చేయాలా అని టెన్షన్ పడ్డ వాళ్లకూ బెంగ తీరింది. 24న తమిళ వెర్షన్‌తో పాటు తెలుగులోనూ విడుదల చేసుకోవడానికి మరీ ఇబ్బంది లేకపోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు