`దేనికైనా రెడీ` అంటున్న నాగ్!

 `దేనికైనా రెడీ` అంటున్న నాగ్!

ఏడాదికి కనీసం మూడు సినిమాలైనా చేయాలనే ఓ తపన కలిగిన కథానాయకుడు నాగార్జున. ఆయన ఖాళీగా ఉండడానికి అస్సలు ఇష్టపడరు. కొత్త కథల కోసం నిరంతరం అన్వేషిస్తుంటారు. కొత్తతరం నటీనటులను, సాంకేతిక నిపుణులను ప్రోత్సహించడంలోనూ నాగార్జున ఒక అడుగు ముందే ఉంటారు. ఎవ్వరు వచ్చి కథలు చెప్పినా ఎంతో ఓపిగ్గా వింటూ ఉంటారు. ఇటీవలే `స్వామి రారా` దర్శకుడు సుధీర్ వర్మ చెప్పిన ఓ కథకు నాగార్జున పచ్చ జెండా ఊపారని సమాచారం.  తాజాగా `దేనికైనా రెడీ` నాగేశ్వర రెడ్డితోనూ  ఓ సినిమా చేసేందుకు అంగీకారం తెలిపారని ఫిలిం నగర్ టాక్.

కామెడీని డీల్ చేయడంలో నాగేశ్వర రెడ్డికి మంచి పట్టుంది. `సిక్స్ టీన్స్` నుంచి `సీమ శాస్త్రి`, `సీమ టపాకాయ్`, `దేనికైనా రెడీ` సినిమాల వరకు ఆయన తీసిన పలు చిత్రాలు చక్కటి ఆదరణ పొందాయి. మంచి కామెడీతో పాటు మంచి యాక్షన్ అంశాలున్న ఓ కథను సిద్ధం చేసుకున్నారు నాగేశ్వర రెడ్డి. ఆ కథను ఇటీవలే నాగార్జునకి వినిపించారట. ఆ కథ నాగార్జునకి బాగా నచ్చిందట. దీంతో వచ్చే ఏడాది ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.  ప్రస్తుతం నాగేశ్వర రెడ్డి...  మంచు మనోజ్ కథానాయకుడిగా ఓ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అది పూర్తవ్వగానే నాగార్జునతో సినిమా ఉంటుందని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు