రా రమ్మంటున్న రెజీనా-ప్రగ్యా

రా రమ్మంటున్న రెజీనా-ప్రగ్యా

ఈ శుక్రవారం విడుదలైన ‘గౌతమ్ నంద’ సత్తా ఏంటో తొలి రోజే తేలిపోయింది. ఈ సినిమా వీకెండ్లో నెట్టుకు రావడమే కష్టమైంది. వీక్ డేస్‌లో ఇంకా వీక్ అయిపోవడం ఖాయమని తెలిసిపోయింది. దీంతో ఫోకస్ అంతా తర్వాతి వారం రాబోయే కొత్త సినిమాలపైకి మళ్లింది. సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కిన ‘దర్శకుడు’తో పాటు కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘నక్షత్రం’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ రెండు సినిమాలపై ఏమంత బజ్ కనిపించట్లేదు. ‘దర్శకుడు’కి సుకుమార్ సమర్పకుడు కావడం తప్ప ఇంకే ఆకర్షణా లేదు. హీరో కొత్తవాడు.. దర్శకుడు కొత్తవాడు. హీరోయిన్ ఈషాకూ కూడా అంత పేరేమీ లేదు. సుక్కు బ్రాండ్ ఏమాత్రం ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తుందో చూడాలి.

ఇక ‘నక్షత్రం’ విషయానికి వస్తే.. ఇది కృష్ణవంశీ గత సినిమాలకు భిన్నమైన బ్రాండ్ తో విడుదలవుతోంది. మామూలుగా కృష్ణవంశీ సినిమా అంటే ఆయనే కనిపిస్తాడు. పోస్టర్ మీద  ఆయన పేరు ఒక్కటి చాలు థియేటర్లకు జనాల్ని రప్పించడానికి. కృష్ణవంశీ బ్రాండ్‌నే ప్రచారంలో కూడా ఉపయోగిస్తారు. కానీ ‘నక్షత్రం’ విషయంలో అలా జరగట్లేదు. గత కొన్నేళ్లలో కృష్ణవంశీ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయిపోవడంతో ఆయన్నిముందు పెట్టి సినిమాను పబ్లిసిటీ చేసే పరిస్థితి లేదు. కృష్ణవంశీ కూడా అలా కోరుకుంటున్నట్లుగా లేడు.

ఈ సినిమా పబ్లిసిటీ అంతా హీరోయిన్లు రెజీనా, ప్రగ్యా జైశ్వాల్‌ల చుట్టూనే తిరుగుతోంది. రతి దేవతల్లా ఉన్న వాళ్ల ఫొటోలతో సెక్సీ పోస్టర్లు రెడీ చేసి.. ప్రేక్షకుల దృష్ణిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. లేటెస్టుగా వదిలిన రిలీజ్ డేట్ పోస్టర్లలో రెజీనా, ప్రగ్యా చాలా సెక్సీగా ఉన్నారు. కుర్రాళ్లను రారమ్మని థియేటర్లకు ఆహ్వానిస్తున్నట్లుగా ఉన్నాయి ఆ పోస్టర్లు. ప్రస్తుతం కృష్ణవంశీ ఉన్న స్థితిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ఇది తప్ప మరో మార్గం లేదన్నట్లుగా ఉంది నిర్మాతల తీరు చూస్తే. ఐతే ఇలాంటి ఆకర్షణలతో ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించొచ్చేమో కానీ.. వాళ్లను కూర్చోబెట్టాలంటే మాత్రం కంటెంటే కీలకం. అది ‘నక్షత్రం’లో ఎంత మాత్రం ఉందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు