రీఎంట్రీ మూవీలో ఆ హీరోని చూశారా?

రీఎంట్రీ మూవీలో ఆ హీరోని చూశారా?

బాలీవుడ్ బ్యాడ్ మ్యాన్ సంజయ్ దత్ ను తెరమీద చూసి చాలా కాలమైపోయింది. మూడేళ్ల కిందట ‘పీకే’లో చిన్న అతిథి పాత్రలో కనిపించాడు సంజూ భాయ్. అది కూడా చాలా ముందుగా చిత్రీకరణ జరుపుకున్న సినిమా. ఆ చిత్రం రిలీజయ్యే సమయానికే సంజూ జైల్లో ఉన్నాడు. నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకుని కొన్ని నెలల కిందటే సంజయ్ బయటి ప్రపంచంలోకి వచ్చాడు.

కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకుని మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. అతను ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘భూమి’. ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ అయింది. స్టన్నింగ్ గా అనిపిస్తున్న ఈ ఫస్ట్ లుక్ ఇన్ స్టంట్ గా హిట్టయిపోయింది. ముఖమంతా మట్టి కొట్టుకుపోయి.. రక్త గాయాలతో చాలా వయొలెంట్ గా కనిపిస్తున్నాడు సంజూ ఇందులో. జనాలు చూపుతిప్పుకోనివ్వకుండా కాసేపు అలాగే చూసేలా చాలా ఇంటెన్సిటీ ఆ లుక్ లో ఉండటం విశేషం.

ఈ మధ్యే ‘చెలియా’తో దక్షిణాది ప్రేక్షకుల్ని పలకరించిన అదితి రావు హైదరి ఈ చిత్రంలో సంజయ్ దత్ కూతురి పాత్ర పోషిస్తుండటం విశేషం. ఇది ఓ తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే రివెంజ్ డ్రామా అని సమాచారం. సెప్టెంబరు 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ‘భూమి’ దర్శకుడు ఒమంగ్ కుమార్ ఇంతకుముందు మేరీ కోమ్.. సరబ్జిత్ సినిమాల్ని డైరెక్ట్ చేశాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు