‘బాహుబలి’పై కృష్ణవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్

‘బాహుబలి’పై కృష్ణవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్

‘బాహుబలి’ సినిమా గురించి చాలామంది లెజెండ్స్ స్పందించారు. ప్రశంసలు కురిపించారు. ఐతే క్రియేటివ్ డైరెక్టర్‌గా.. గొప్ప ఫిలిం మేకర్‌గా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ లాంటి వాళ్లు ఆ సినిమా గురించి మాట్లాడితే ఆసక్తి రేకెత్తడం ఖాయం. ఇంతకుముందే ఒకసారి ‘బాహుబలి’లో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర విషయమై స్పందించాడు కృష్ణవంశీ. ఆ పాత్రను తీర్చిదిద్దడంలో రచయిత, దర్శకుడి కృషిని అభినందించాడు. తాజాగా ఈ సినిమాపై సందర్భోచితంగా ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు కృష్ణవంశీ. తాను గొప్ప దర్శకుడిని కాదంటూ.. అసలు తనను తాను దర్శకుడిగానే గుర్తించనని చెబుతూ.. ‘బాహుబలి’ లాంటి సినిమాలు చూసినపుడు డైరెక్షన్ అంటే ఏంటో తెలుస్తందంటూ కృష్ణవంశీ వ్యాఖ్యానించడం విశేషం.

తనకు ‘క్రియేటివ్ డైరెక్టర్’గా ఉన్న గుర్తింపు గురించి కృష్ణవంశీ స్పందిస్తూ.. ‘‘నా పేరు కృష్ణవంశీ. క్రియేటివ్‌ డైరెక్టర్‌ లాంటి మాటలతో నాకు సంబంధం లేదు. నేను సినిమాల్లో ఏదీ క్రియేట్ చేయలేదు. రీ క్రియేట్‌ చేస్తున్నా. అంతే. నేను డైరెక్టర్‌ననే అనుకోను. మణిరత్నం సినిమాలు.. ‘బాహుబలి’లాంటి సినిమాలు చూసినప్పుడు ఇదిరా డైరెక్షన్‌ అంటే అనిపిస్తుంది.  

మణిరత్నం గారిలా ఓ సినిమా తీయాలని.. బాపుగారిలా ఓ పాట తీయాలని కోరికలున్నా యి. నేను ఇప్పటికీ రామ్ గోపాల్‌ వర్మ అసిస్టెంట్‌ అనే అనుకుంటా. నేను కూడా ఓ దర్శకుడిని అనే ఫీలింగ్ వచ్చిన రోజు సినిమాలు ఆపేసి వ్యవసాయంలోకి వెళ్లిపోతా. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో ఓ ఫామ్‌హౌస్‌ కొనాలనుకుంటున్నా. కుదరట్లేదు’’ అని కృష్ణవంశీ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు