అత్తారింటికి అదనపు హంగులు!

అత్తారింటికి అదనపు హంగులు!

తెలుగు చిత్ర సీమలో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్న చిత్రం `అత్తారింటికి దారేది`. రేపో మాపో వంద కోట్ల వసూళ్ళ మైలురాయిని చేరుకోబోతోంది. ఈ చిత్రంతో పవన్ సత్తా ఏమిటో బాక్సాఫీసు ముందు మరో మారు రుజువైంది. ఇటీవలే 25 రోజులు పూర్తి చేసుకున్న  అత్తారిల్లు మరికొన్ని కొత్త హంగులతో ముస్తాబవబోతోంది. అదనంగా కొన్ని సన్నివేశాలు జోడిస్తున్నట్టు సమాచారం.

 ఎడిట్ లో భాగంగా తీసేసిన సన్నివేశాలను సినిమాలో కలపబోతున్నట్టు సమాచారం. తొలి భాగంలో ఓ సన్నివేశాన్ని మలిభాగంలో బ్రహ్మానందంపై వచ్చే ఓ సన్నివేశాని కలిపి ప్రదర్శించబోతున్నట్టు తెలుస్తోంది. దీనిద్వారా సినిమాకి మరింత మైలేజ్ వస్తుందని చిత్ర బృందం ఆశపడుతోంది. యాభై రోజుల దిశగా దూసుకెళుతున్న ఈ సినిమా భవిష్యత్తులో మరెంన్ని సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు