రెండు డోసులు వేసుకున్నా చనిపోతున్నారా ?

కోవిడ్ టీకా రెండు డోసులు వేయించుకున్నవారిలో కరోనా వైరస్ తీవ్రత తక్కువగానే ఉంటుందని ఇప్పటివరకు చెప్పుకుంటున్నారు. ఇది కొందరిలో వాస్తవమే అయ్యుండచ్చు కానీ అందరిలోను కాదు. ఈ విషయం సీషెల్స్ దేశంలో నిరూపణయ్యింది. దాంతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. విషయం ఏమిటంటే సీషెల్స్ అనేది ప్రపంచ పర్యాటక ప్రాంతాల్లో ఒకటన్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ దేశంలో కోవిడ్ కారణంగా ప్రపంచ పర్యాటకులకు తలుపులు మూసేశారు. అయితే దేశంలో టీకాల కార్యక్రమం స్పీడందుకున్న నేపధ్యంలో కరోనా కేసులు కూడా బాగా తగ్గిపోయాయి. 98 వేల జనాభా ఉన్న ఈ దేశంలో ఇప్పటికి 61 శాతం జనాభాకు రెండు డోసుల టీకాలు వేశారు. టీకాల కార్యక్రమాన్ని ఇక్కడ నూరుశాతం ప్రభుత్వమే చేస్తోంది.

లాక్ డౌన్, కర్ఫ్యూ, భౌతికదూరం పాటించటం లాంటి వాటితో టీకాల కార్యక్రమం చాలా జోరుగా జరగటంతో కేసుల తీవ్రత బాగా తగ్గిపోయింది. ఎలాగూ కేసులు తగ్గిపోయింది కాబట్టి ప్రపంచపర్యాటకానికి గేట్లు ఎత్తేసింది అక్కడి ప్రభుత్వం. ఇంకేముంది పర్యాటకులందరు సీషెల్స్ లోకి పరుగులు పెట్టారు. స్ధానిక జనాభాతో పాటు పర్యాటకుల సంఖ్య పెరిగిపోవటంతో భౌతికదూరం పాటించటం, మాస్కులు ధరించటం మానేశారు.

ఎప్పుడైతే కోవిడ్ జాగ్రత్తలు మానేశారో వెంటనే కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతోందట. మే నెల మొదటివారంలో ఉన్న 3800 కేసులు ఇప్పటికి 10 వేలకు పెరిగిపోయాయట. అలాగే మరణాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. దీంతో రెండు డోసుల టీకాలు వేయించినా ఉపయోగం లేదని తేలిపోయింది. కారణం ఏమిటంటే జాగ్రత్తలు తీసుకోకపోవటమే. అంటే టీకాలు వేయించుకున్ననిర్లక్ష్యంతో జాగ్రత్తలను గాలికొదిలేస్తే ప్రాణాలు కూడా పోతాయని తాజాగా నిరూపితమైంది.