ముందు అక్కినేని, వెనక నందమూరి

ముందు అక్కినేని, వెనక నందమూరి

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ప్లాన్స్‌ అన్నిటినీ బాలకృష్ణ మార్చి పారేసాడు. సెప్టెంబర్‌ 1న జవాన్‌ రిలీజ్‌ ప్లాన్‌ చేసుకుంటే, అదే డేట్‌కి పైసా వసూల్‌ అనౌన్స్‌ అవడంతో జవాన్‌ రిలీజ్‌ డేట్‌ కన్‌ఫ్యూజన్‌లో పడింది.

ఆగస్టు 25న వేసేద్దామని చూస్తే, అక్కినేని నాగచైతన్య నటించిన 'యుద్ధం శరణం' అదే తేదీకి రావచ్చుననే సంకేతాలు అందుతున్నాయి. సెప్టెంబర్‌ రెండవ వారంలో వేస్తే, జై లవకుశ, స్పైడర్‌ వచ్చేసరికి సినిమాకి వసూళ్లు వస్తున్నా తీసేస్తారనే భయంతో అప్పుడు కూడా వేయకూడదని అనుకుంటున్నారు. రిస్కు చేసి సెప్టెంబర్‌ 29న వేస్తే దసరా హాలిడే కలిసి వస్తుందనే ఐడియా వుందట కానీ జవాన్‌ బయ్యర్లు అందుకు అంగీకరిస్తారా అనేది అనుమానంగా వుంది.

జై లవకుశ, స్పైడర్‌ థియేటర్లలో ఇంకా ఫ్రెష్‌గా వుండగా, దీనికి థియేటర్లు సాధించడం కష్టమైపోతుంది. అక్టోబర్‌ రెండవ వారంకి వెళ్లడానికి కూడా లేకుండా 'రాజుగారి గది 2'ని నాగార్జున అక్టోబర్‌ 13కి అనౌన్స్‌ చేసేసాడు. అదీ కాక రవితేజ 'రాజా ది గ్రేట్‌' కూడా అదే సమయానికి రిలీజ్‌ అవుతుంది. పైసా వసూల్‌ ఒక్క దాని డేట్‌ మారడంతో జవాన్‌ ఫేట్‌ మారిపోయింది పాపం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English