లొకేషన్స్‌ సరే, హీరో ఎవరు సార్‌?

లొకేషన్స్‌ సరే, హీరో ఎవరు సార్‌?

'డిజె' చిత్రానికి వచ్చిన వసూళ్ల కంటే రాని వసూళ్ల గురించి జరిగిన రచ్చే ఎక్కువ. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు మీడియాపై కత్తి దూసిన హరీష్‌ శంకర్‌ని మీడియా టార్గెట్‌ చేసేసింది. మామూలుగా ఫేక్‌ కలక్షన్ల లెక్కలు చెబితే చూసీ చూడనట్టు వదిలేసే మీడియా డిజె విషయంలో మాత్రం దానిని హైలైట్‌ చేసింది.

అల్లు అర్జున్‌ స్టార్‌డమ్‌ వల్ల భారీ నష్టాలు తప్పించుకున్న డీజే ఇరవై నుంచి ముప్పయ్‌ శాతం వరకు అయితే నష్టాలు చూసింది. దిల్‌ రాజు జోరు మీద వున్నాడు కనుక అతని హిట్ల ఖాతాలో వేసి కానిచ్చేస్తున్నారు కానీ అల్లు అర్జున్‌ రీసెంట్‌ సినిమాల్లో నష్టాలొచ్చింది దీనికే. ఇకపోతే డీజే తర్వాత హరీష్‌ నెక్స్‌ట్‌ సినిమా ఏమిటనే టాక్‌ మొదలు కావడంతో, యుఎస్‌లో హాలిడే ఎంజాయ్‌ చేస్తోన్న హరీష్‌ అక్కడ్నుంచి ఫోటోలు పోస్ట్‌ చేస్తూ నెక్స్‌ట్‌ సినిమాకి లొకేషన్ల వేట అంటున్నాడు.

ఆలూ లేదు చూలూ లేదు అన్నట్టు, ఇంకా కథ ఓకే కాలేదు, హీరో సెట్‌ అవలేదు కానీ అప్పుడే లొకేషన్లు వెతకడమేంటనేది ఇంటర్నెట్‌ కామెంటు. బహుశా తన తదుపరి చిత్రం వివరాలు గోప్యంగా వుంచి సర్‌ప్రైజ్‌ చేయాలని చూస్తున్నాడేమో. ఈసారి హరీష్‌ ఏ హీరోతో తీస్తాడనేది ఒకింత ఇంట్రెస్టింగ్‌ టాపిక్కే మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు