నాకా.. నోటీసులా అన్న ఆ హీరో కూడా..

నాకా.. నోటీసులా అన్న ఆ హీరో కూడా..

డ్రగ్స్ కేసుకు సంబంధించి సినీ ప్రముఖులకు నోటీసులివ్వడం రెండు వారాల కిందట ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. ఆ నోటీసులందుకున్న వాళ్లలో కొందరు తమకు నోటీసులు వచ్చిన విషయాన్ని అంగీకరిస్తూ.. తాము డ్రగ్స్ తీసుకున్నట్లు వచ్చిన వార్తల్ని ఖండించారు. కానీ కొందరు మాత్రం తమకు అసలు నోటీసలే అందలేదని.. తమను ఈ వ్యవహారంలోకి ఎందుకు లాగుతున్నారని మీడియా మీద పడ్డారు.

అందులో సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడు ఒకరైతే.. మరొకరు యువ కథానాయకుడు తనీష్. ఐతే శ్యామ్ కె.నాయుడు.. పూరి విచారణకు హాజరైన మరుసటి రోజే సిట్ అధికారుల ముందుకు వెళ్లడంతో ఆయన వ్యాఖ్యలు అబద్ధమని తేలిపోయింది.

ఇప్పుడు తనీష్ సైతం సిట్ అధికారుల ముందుకు హాజరవడం విశేషం. అప్పుడు డ్రగ్ రాకెట్‌తో తనకేమీ సంబంధం లేదని, నోటీసులే రాలేదన్న తనీష్ ఇప్పుడు విచారణకు హాజరవుతూ మీడియా కెమెరాలకు దొరికిపోయాడు. మరి విచారణ అనంతరం మీడియాను ఎదుర్కొన్నపుడు తనీష్ ఏమంటాడో చూడాలి. డ్రగ్స్ కుంభకోణంలో కీలక సూత్రధారిగా ఉన్న కెల్విన్ ఫోన్లో తనీష్ నంబర్ ఉన్నట్లు.. వీళ్లిద్దరి మధ్య పలుమార్లు సంభాషణలు జరిగినట్లు చెబుతున్నారు.

మరి పోలీసుల విచారణలో తనీష్ ఏం చెబుతాడో.. బ్లడ్ శాంపిల్ అడిగితే సరే అంటాడో.. నో చెబుతాడో చూడాలి. డ్రగ్స్ రాకెట్‌కు సంబంధించి సినీ ప్రముఖుల విచారణ దాదాపుగా పూర్తి కావచ్చింది. సిట్ నుంచి నోటీసులు అందుకుని.. విచారణకు హాజరైన వాళ్లందరూ నిందితులని అనుకోలేం. విచారణ పూర్తయ్యాక పోలీసులు ప్రకటన చేసే వరకు ఎవరి మీదా ఒక అంచనాకు రాలేం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు