ప్రభాస్ ఆ నెల రోజులు ఏం చేశాడు?

ప్రభాస్ ఆ నెల రోజులు ఏం చేశాడు?

బహుశా తెలుగు సినిమా చరిత్రలోనే కాదు.. మొత్తం ఇండియాలో ఒక స్టార్ హీరో ఒక ప్రాజెక్టు కోసం వేరే సినిమాలేవీ పెట్టుకోకుండా నాలుగేళ్ల సమయాన్ని కేటాయించడం అన్నది ప్రభాస్ విషయంలోనే జరిగి ఉంటుందేమో. 2013 ఆరంభంలో ప్రభాస్ ‘బాహుబలి’ ప్రయాణం.. 2017లో కానీ ముగియలేదు.

2013లో ‘బాహుబలి: ది బిగినింగ్’ మొదలవడానికి ముందు ట్రైనింగ్‌తో మొదలుపెట్టి.. 2017లో ‘బాహుబలి: ది కంక్లూజన్’ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ల వరకు తీరిక లేకుండా గడిపాడు ప్రభాస్. మరి ఆ సినిమా నుంచి బయటపడగానే ప్రభాస్ ఏం చేశాడు? ఎలా రిలాక్సయ్యాడు? ఈ విశేషాల్ని ఓ నేషనల్ డైలీతో పంచుకున్నాడు యంగ్ రెబల్ స్టార్.

‘బాహుబలి’ పని ముగిశాక ఏం చేశారు అని ప్రభాస్‌ను అడిగితే.. ‘‘ముందు నేను చేసిన పని నా జుట్టు కత్తిరించుకోవడం. అంత పొడవాటి జుట్టుతో అన్నేళ్లు కొనసాగడం చాలా ఇబ్బందైంది. ఇక ‘బాహుబలి-2’ విడుదలైన రెండు రోజుల తర్వాత నేను యుఎస్‌కు బయల్దేరాను. అక్కడ సినిమా ఆలోచనల్ని పూర్తిగా పక్కన పెట్టేశాను. నా క్లోజ్ ఫ్రెండ్స్ నాతో పాటు వచ్చారు. బీచ్ ముందు ఉన్న ఓ స్పెషల్ హౌస్‌లో రిలాక్సయ్యాం.

 సినిమాల గురించి ఆలోచించడం తప్ప ఇక అన్నీ చేశాం అక్కడ. మామూలుగానే నాకు ఇలాంటి పర్యటనలంటే ఇష్టం. పైగా నాలుగేళ్ల పాటు ఒకే సినిమా కోసం అంకితమై ఉండటంతో ఈసారి మరింతగా ఎంజాయ్ చేశాను’’ అని ప్రభాస్ తెలిపాడు. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘సాహో’ సైంటిఫిక్ థ్రిల్లర్ కాదని.. ఇది యాక్షన్ ఓరియెంటెడ్ హైటెక్ మూవీ అని ప్రభాస్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English