పవర్‌స్టార్‌తో జాయింట్‌ బిజినెస్‌

పవర్‌స్టార్‌తో జాయింట్‌ బిజినెస్‌

పవన్‌కళ్యాణ్‌కి అత్యంత ఆప్తుడైపోయిన త్రివిక్రమ్‌ ఇప్పుడు పవర్‌స్టార్‌కి ఉన్న అతి సన్నిహితుడు, స్నేహితుడూనట. ఈమధ్య కాలంలో త్రివిక్రమ్‌, పవన్‌ మరింత క్లోజ్‌ అయ్యారు. పవన్‌ని కలుసుకోవాలన్నా, కథ ఓకే చేయాలన్నా కూడా త్రివిక్రమ్‌ ద్వారా వెళ్లాలని కూడా అంటున్నారు. ఇద్దరి భావజాలం ఒకటేనని పవన్‌కళ్యాణ్‌ కూడా చెప్పాడు. ఈ ఇద్దరూ హీరో, దర్శకుడిగానే కాకుండా కలిసి చిత్ర నిర్మాణం చేపట్టే ఆలోచనలో కూడా ఉన్నారు.

ఆమధ్య అనౌన్స్‌ చేసిన కోబలి చిత్రాన్ని తామిద్దరం జాయింట్‌గా ప్రొడ్యూస్‌ చేస్తామని త్రివిక్రమ్‌ చెప్పాడు. ఆ సినిమా ఎప్పుడు మొదలయ్యేదీ చెప్పకపోయినా, తప్పకుండా తెరకెక్కుతుందని మాత్రం త్రివిక్రమ్‌ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇకపై కలిసి సినిమాలు నిర్మిస్తామని త్రివిక్రమ్‌ అన్నాడు. కోబలి చిత్రం రాయలసీమ నేపథ్యంలో ఉంటుందని, అక్కడ అమ్మవారికి ఇచ్చే బలుల్ని కోబలి అంటారని, దానిపై పరిశోధన జరుగుతోందని, కాస్త రిస్కుతో కూడిన సబ్జెక్ట్‌ కాబట్టి తాము నిర్మించాలని నిర్ణయించుకున్నామని త్రివిక్రమ్‌ తెలిపాడు. ఆ చిత్రం గురించి డీటెయిల్స్‌ ఏమీ చెప్పలేదు కానీ ‘గబ్బర్‌సింగ్‌ 2’కి తాను సంభాషణలు రాస్తున్నాననేది నిజం కాదని చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు