గౌతమ్‌ నంద పూర్‌ షో

గౌతమ్‌ నంద పూర్‌ షో

గోపిచంద్‌తో పాటు దర్శకుడు సంపత్‌ నంది కూడా చాలా ఆశలు పెట్టుకున్న గౌతమ్‌ నంద తొలి రోజు నిరాశ పరిచింది. విడుదలకి ముందు వచ్చిన బజ్‌కి టాక్‌తో సంబంధం లేకుండా మొదటి రోజున వసూళ్లు బాగుంటాయని ఆశించారు. కానీ ఓపెనింగ్‌ చాలా వీక్‌గా వచ్చింది. దానికి తోడు టాక్‌ కూడా ఎంకరేజింగ్‌గా లేదు. శనివారం అయినా పుంజుకుంటుందేమో అనుకుంటే, సెకండ్‌ డే కలక్షన్లలో ఎలాంటి గ్రోత్‌ కనిపించలేదు.

దీంతో ఆదివారం మీదే బయ్యర్లు ఆశ పడుతున్నారు. ఈమధ్య కాలంలో వచ్చిన చాలా చిత్రాలు తొలి ఆదివారం అదరగొట్టాయి. ఆదివారం కనీసం ముప్పయ్‌ శాతం గ్రోత్‌ అయినా చూపిస్తుందని ఆశిస్తున్నారు. టాక్‌ బాలేదు కనుక వీక్‌ డేస్‌లో సస్టెయిన్‌ అవడం కష్టం. అందులోను వచ్చే వారం కొత్త సినిమాలు కూడా రిలీజ్‌ అవుతున్నాయి కనుక మరో వీకెండ్‌ వుందనే ధీమా కూడా వుండదు.

ఈ నేపథ్యంలో ఆదివారం ఈ చిత్రానికి చాలా కీలకం. టాక్‌ సరిగా లేకపోయినా పబ్లిసిటీతో ఆకట్టుకోవచ్చు. కానీ అలాంటి ప్రయత్నాలేమీ జరుగుతున్నట్టు కనిపించడం లేదు. ఇరవై రెండు కోట్లకి పైగా రాబడితే తప్ప సేఫ్‌ కాలేని చిత్రాన్ని ఎంత వరకు లాగుతారనేది చూడాలిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English