కొత్త పోరీ ఎవరు బాస్‌?

కొత్త పోరీ ఎవరు బాస్‌?

'బిగ్‌బాస్‌' షోలో అనుకున్నట్టుగానే వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా కొత్త కంటెస్టెంట్‌ వస్తోంది. సంపూర్ణేష్‌ బాబు మధ్యలో పలాయనం చిత్తగించడంతో అతని రీప్లేస్‌మెంట్‌గా మరొకర్ని తీసుకురావాల్సి వచ్చింది. తమిళ బిగ్‌బాస్‌ షోకి ఒవియా, రైజా వున్నట్టుగా ఇక్కడ షోలో గ్లామర్‌ లేదనే కంప్లయింట్స్‌ అధికర అవడంతో, ఇప్పుడున్న వారిలో చాలా మంది మిడిల్‌ ఏజ్‌ వాళ్లే కావడంతో ఈ షోకి వన్నె తేవడం కోసం పబ్లిక్‌ డిమాండ్‌పై లేడీ కంటెస్టెంట్‌నే బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంటర్‌ చేస్తున్నారు. అయితే ఆమె ఎవరనేది రివీల్‌ చేయలేదు.

కేవలం ఆమెని వెనకనుంచి మాత్రమే చూపించగా ఆమె ఎవరై వుంటుందా అంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. జబర్దస్త్‌ రష్మి, హంసానందిని లేదా తేజస్వి అయి వుండవచ్చునని బలంగా వినిపిస్తోంది. సోషల్‌ మీడియాలోను వెనక నుంచి చూసి చాలా మంది ఈ ముగ్గురి పేర్లే గెస్‌ కొడుతున్నారు. ఈవారం మధుప్రియని ఎలిమినేట్‌ చేస్తున్నట్టు ఎన్టీఆర్‌ ప్రకటించాడు కానీ, సోమవారం 'ఎలిమినేషన్స్‌ వుండవు' అంటూ ఒక ప్రకటన చేసారు కనుక మధుప్రియ ఎలిమినేషన్‌ లాస్ట్‌ మినిట్‌లో కాన్సిల్‌ చేసినా చేయవచ్చు.

మరోవైపు తమిళ బిగ్‌ బాస్‌లో కూడా రేపు కొత్త లేడీని ఎంటర్‌ చేస్తున్నారు. ఆ సస్పెన్స్‌ని చేధిస్తూ బిందు మాధవి వస్తోందంటూ సోషల్‌ మీడియాలో మీమ్స్‌ కూడా రెడీ చేసేసారు. ఏది ఏమైనా ప్రతి వారం షోలో ఆసక్తి పెంచడం కోసం ఏదో ఒక ట్రిక్కు ప్లే చేస్తూ రేటింగ్స్‌ని కాపాడుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు