‘దంగల్’ గొప్పదనమేంటో చెప్పిన ‘బాహుబలి’ రైటర్

‘దంగల్’ గొప్పదనమేంటో చెప్పిన ‘బాహుబలి’ రైటర్

‘బాహుబలి: ది కంక్లూజన్’ రిలీజై కనీ వినీ ఎరుగని స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టి ఇండియన్ సినిమా రికార్డులన్నింటినీ అలవోకగా దాటేసి దూసుకెళ్లిపోతున్న సమయంలో రీఎంట్రీ ఇచ్చింది ‘దంగల్’ సినిమా. గత ఏడాదే ఇండియాలో విడుదలై థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ చిత్రం.. ‘బాహుబలి-2’ విడుదలైన వారానికి చైనాలో రిలీజై.. అక్కడ అనూహ్యమైన వసూళ్లు సాధించింది. బాహుబలి-2 నెలకొల్పిన వరల్డ్ వైడ్ వసూళ్ల రికార్డును చైనా కలెక్షన్ల ద్వారా కొన్ని రోజులకే అధిగమించి.. ‘బాహుబలి’ మేకర్స్‌కు రికార్డు కొట్టిన సంతోషం లేకుండా చేసింది. ఐతే ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాత్రం ‘దంగల్’ విషయంలో అసలేమాత్రం జలసీ చూపించట్లేదు. దానిపై ప్రశంసలు కురిపించాడాయన. చైనాలో ‘దంగల్’ ఎందుకు అంత బాగా ఆడిందో ఆయన విశ్లేషించాడు.

‘‘బాహుబలి-2 చైనాలో విడుదలైనా ‘దంగల్’ వసూళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ దాటదు. అక్కడ ఈ తరహా పీరియడ్ సినిమాలు చాలానే వస్తుంటాయి. వాటి మధ్య ‘దంగల్’ భిన్నంగా కనిపించింది. ఇందులో యూఎస్పీ.. అమ్మాయిలు క్రీడల్లో రాణించి, కుటుంబ బాధ్యత తీసుకుని తమ సత్తా చాటుకోవడమే. ఇదే అక్కడి జనాల్ని ఎక్కువగా ఆకట్టుకుందని అనుకుంటున్నా.

అక్కడ రెజ్లింగా ఇంకో క్రీడా అన్నది ముఖ్యం కాదు. అమ్మాయిలు టార్చ్ బేరర్స్ కావడమన్నదే గొప్ప పాయింట్. అదే చైనా ప్రేక్షకులకు బాగా నచ్చిందని అనుకుంటున్నా. ‘బాహుబలి-2’ కలెక్షన్లను ‘దంగల్’ దాటినందుకు బాధేమీ లేదు. అది కూడా మన ఇండియన్ సినిమా కావడం సంతోషంగా ఉంది’’ అని విజయేంద్ర ప్రసాద్ విశ్లేషించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు