పవన్‌కళ్యాణ్‌ జడ్జిమెంట్‌ కరక్టేనండోయ్‌

పవన్‌కళ్యాణ్‌ జడ్జిమెంట్‌ కరక్టేనండోయ్‌

పవన్‌కళ్యాణ్‌తో పని చేయాల్సిన డైరెక్టర్‌ సంపత్‌ నంది రెండేళ్ల పాటు ఎదురు చూసి కూడా ఆ అవకాశం కోల్పోయాడు. 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'కి డైరెక్షన్‌ చేయడం కోసం వెళ్లిన సంపత్‌ని తన కథలేమైనా వుంటే చెప్పమని పవన్‌ కోరాడట. అప్పుడతను పవన్‌కి రెండు కథలు చెప్పగా రెండూ రిజెక్ట్‌ అయ్యాయి.

దాంతో పవన్‌ తనకే ఒక కథ చెప్పి డెవలప్‌ చేయమంటే అది తనకి నచ్చే విధంగా మలచలేకపోయినందుకు సంపత్‌ని తప్పించారు. ఫైనల్‌గా బాబీకి ఆ చిత్రానికి దర్శకత్వం వహించే ఛాన్స్‌ వచ్చింది. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ డిజాస్టర్‌ అయిందనుకోండి. కాకపోతే ఆ సినిమా చేయడం వల్ల బాబీకి మరో భారీ చిత్రానికి అవకాశం వచ్చింది.

ప్రస్తుతం అతను ఎన్టీఆర్‌తో జైలవకుశ చిత్రం చేస్తున్నాడు. అప్పుడు పవన్‌కి చెప్పిన రెండు కథలని సంపత్‌ సినిమాలుగా మలిచేసాడు. ఒకటేమో రవితేజతో తీసిన బెంగాల్‌ టైగర్‌ కాగా, మరొకటి గోపిచంద్‌తో తీసిన గౌతమ్‌ నంద. బెంగాల్‌ టైగర్‌ కమర్షియల్‌గా యావరేజ్‌ అవగా, గోపిచంద్‌ సినిమాకి కూడా ఫీడ్‌బ్యాక్‌ ఆశాజనకంగా లేదు.

ఈ రెండు సినిమాలు పవన్‌ రేంజ్‌ స్టార్‌ వుంటే మరింత బ్యాడ్‌ టాక్‌ తెచ్చుకునేవి. పవన్‌ రిజెక్ట్‌ చేసిన కథలు చాలా వరకు బ్లాక్‌బస్టర్‌ అయ్యాయి కానీ సంపత్‌ విషయంలో మాత్రం పవర్‌స్టార్‌ జడ్జిమెంట్‌ రైట్‌ అయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English