డియర్‌ సెన్సార్‌... డీజేని ఎందుకు తొక్కేసారు?

డియర్‌ సెన్సార్‌... డీజేని ఎందుకు తొక్కేసారు?

'డిజె' చిత్రంలో అన్ని మసాలాలు దట్టించిన హరీష్‌ శంకర్‌ తన హీరోయిన్‌ పూజా హెగ్డేతో బికినీ కూడా వేయించాడు. అయితే ఆ సీన్‌ని సెన్సార్‌ బోర్డ్‌ బ్లర్‌ చేసేసింది. పూజ నీళ్లల్లోంచి బయటకి రాగానే తొడలు కనిపించకుండా బ్లర్‌ చేసేయడం వల్ల ఆ సీన్‌ ఎఫెక్ట్‌ పోయింది. అయితే ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో బికినీ సీన్లు కనిపిస్తున్నప్పటికీ వాటిని ఇలా బ్లర్‌ చేయకపోవడం విశేషం.

'పటేల్‌ సర్‌'లో కానీ, తాజాగా 'గౌతమ్‌ నంద'లో కానీ బ్లర్‌ చేయలేదు. 'గౌతమ్‌ నంద'లో అయితే క్యాథరీన్‌ బికినీ వేసుకుని నీళ్లల్లోంచి బయటకి వచ్చే షాట్‌ని రెండు సార్లు రిపీట్‌ చేసారు. అయినప్పటికీ బ్లర్‌ చేయలేదు. దీనిని బట్టి కొన్ని సినిమాలకే కఠిన షరతులు విధిస్తున్నారనేది అర్థమవుతోంది.

అప్పట్లో బిజినెస్‌మేన్‌ సినిమాకి హీరోయిన్‌తో పాటు సైడ్‌ డాన్సర్లు ఎక్కడ తొడలు కనిపించేలా డ్రస్‌లు వేసుకున్నా స్క్రీన్‌ మొత్తం బ్లర్‌ చేసి పడేసారు. కానీ ఆ తర్వాత చాలా చిత్రాల్లో అంతకుమించిన ఎక్స్‌పోజింగ్‌ వున్నా కానీ చూసీ చూడనట్టు వదిలేసారు.

పెద్ద సినిమాలకే కఠిన షరతులు విధిస్తూ మిగతా చిత్రాల విషయాల్లో చూసీ చూడనట్టు వ్యవహరిస్తోందని సెన్సార్‌ బోర్డ్‌పై కంప్లయింట్స్‌ వున్నాయి. ఈ ఎగ్జాంపుల్స్‌ చూస్తోంటే వారి ఆరోపణలు నిజమేననిపిస్తోంది. అందరికీ సమ న్యాయం అంటూ పారదర్శకత చూపించకపోతే ఇలాంటి ఆరోపణలు సహజం మరి. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు