గోపిచంద్‌ మార్కెట్‌ ఇంత డ్యామేజ్‌ అయిందా?

గోపిచంద్‌ మార్కెట్‌ ఇంత డ్యామేజ్‌ అయిందా?

గోపిచంద్‌ మార్కెట్‌ ఇంత డ్యామేజ్‌ అయిందా?గోపిచంద్‌ సినిమాలకి ఒక టైమ్‌లో గ్యారెంటీ మార్కెట్‌ వుండేది. మధ్య శ్రేణి హీరోల్లో మినిమం గ్యారెంటీ ఓపెనింగ్స్‌ తెచ్చి పెట్టేవాడు. రవితేజతో సమానంగా ఒక టైమ్‌లో రాణించిన గోపిచంద్‌ మార్కెట్‌కి ఇటీవలి కాలంలో చాలా డ్యామేజ్‌ జరిగింది.

సినిమాల మధ్య గ్యాప్‌ రావడం, వచ్చిన సినిమాల్లో చాలా వరకు ఫ్లాప్‌ అవడంతో పాటు విడుదలకి సిద్ధమైన సినిమాలు కూడా చివరి నిమిషంలో ఫైనాన్స్‌ ఇబ్బందులతో వాయిదా పడడం వల్ల గోపి మార్కెట్‌ బాగా ఎఫెక్ట్‌ అయింది. దాని ప్రభావం అతని తాజా చిత్రం 'గౌతమ్‌నంద'పై కనిపిస్తోంది. ట్రెయిలర్స్‌ చూసి ఇది ఖచ్చితంగా ఆడేస్తుందనే నమ్మకంతో బయ్యర్లు భారీ రేట్లకి ఈ చిత్రాన్ని విక్రయించారు.

అయితే ఓపెనింగ్స్‌తోనే ఈ చిత్రం నీరసం తెప్పించింది. ఒకటి, రెండు ఏరియాలు మినహా చాలా చోట్ల ఈ చిత్రం వసూళ్లు డల్‌గా స్టార్ట్‌ అయ్యాయి. గోపిచంద్‌కి మంచి ఫాలోయింగ్‌ వున్న మాస్‌ కేంద్రాల్లోను దీనికి ఓపెనింగ్స్‌ వీక్‌గా రావడం ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం మధ్య శ్రేణి హీరోల్లో చాలా ఆప్షన్లు వుండడం, ఆ రేంజ్‌ హీరోల సినిమాలు కనీసం రెండు వారాలకి ఒకటి వస్తూ వుండడంతో గోపిచంద్‌పై ఆసక్తి తగ్గినట్టుంది.

కథల ఎంపికలో ఇక అతను ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకపోతేనే మంచిది. ఏమాత్రం ఛాన్స్‌ తీసుకున్నా మొదటికే మోసం వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English