రామోజీ పెళ్లిలో ఇద్ద‌రు చంద్రుళ్ల తీరే వేర‌యా!

రామోజీ పెళ్లిలో ఇద్ద‌రు చంద్రుళ్ల తీరే వేర‌యా!

బోలెడ‌న్ని విశేషాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచింది రామోజీ మ‌న‌మ‌రాలి పెళ్లి వేడుక‌. లెక్క‌లేనంత మంది వీవీఐపీలు ఈ పెళ్లి వేడుక‌కు పోటెత్తారు. ఎంత‌మంది వీవీఐపీలు వ‌చ్చినా.. కొంద‌రు ప్ర‌ముఖులు మాత్రం సెంటర్ ఆఫ్ ద అట్రాక్ష‌న్ గా మారార‌ని చెప్పాలి. వీరిలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు.. ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌..బాల‌కృష్ణ‌.. బాలీవుడ్ న‌టుడు అభిషేక్ బ‌చ్చ‌న్ త‌దిత‌రులు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు.

ఇక‌.. తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల విష‌యానికి వ‌స్తే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పెళ్లి వేడుక‌కు ముందుగా వ‌చ్చారు.  ఆయ‌న వ‌చ్చిన పావు గంట‌.. ఇర‌వై నిమిషాల తేడాతో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌చ్చారు. చంద్ర‌బాబు వెంట ఆయ‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి.. కుమారుడు క‌మ్ ఏపీ రాష్ట్ర మంత్రి లోకేశ్ ఆయ‌న స‌తీమ‌ణి బ్రాహ్మ‌ణి త‌దిత‌రులు వ‌చ్చారు. ఇక‌.. కేసీఆర్ వెంట మాత్రం ఆయ‌న స‌తీమ‌ణి.. మేన‌ల్లుడు హ‌రీశ్ తో పాటు ప‌లువురు రాష్ట్ర మంత్రులు వ‌చ్చారు.

రామోజీ ద‌గ్గ‌ర కాసేపు ఉన్న చంద్ర‌బాబు.. వ‌ధూవ‌రుల్ని ఆశీర్వ‌దించి.. ఆ త‌ర్వాత రామోజీ ప‌క్క‌నే ఉండిపోయారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. వేడుక‌కు వ‌చ్చిన ప‌లువురిని త‌న సొంతిట్లో వేడుక మాదిరి బాబు ప‌లుక‌రించ‌టం క‌నిపించింది. రామోజీ.. బాబు ఇద్ద‌రూ కూర్చొని మాట్లాడుకుంటున్న వేళ‌.. కేసీఆర్ వ‌స్తున్న‌హ‌డావుడిని రామోజీ గుర్తించారు. ఆయ‌న త‌న‌కు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చేస‌రికి లేచి నిల‌బ‌డ్డారు. కేసీఆర్ వ‌చ్చి రామోజీని ప‌లుక‌రించారు. ఆ త‌ర్వాత వ‌ధూవ‌రుల్ని ఆయ‌న ఆశీర్వ‌దించారు. అనంత‌రం కేసీఆర్ వెంట వ‌చ్చిన వారు కింద‌కు వెళ్ల‌గా.. కేసీఆర్ మాత్రం రామోజీ వ‌ద్ద‌కు వ‌చ్చారు.ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రు చంద్రుళ్లు కాసేపు మాట్లాడుకోవ‌టం క‌నిపించింది.

ఐదు నిమిషాల  పాటు రామోజీ ద‌గ్గ‌ర ఉన్న కేసీఆర్ ఆ త‌ర్వాత కింద‌కు దిగి వెళ్లిపోయారు. కానీ.. చంద్ర‌బాబు మాత్రం రామోజీతో మాట్లాడుతూ.. పెళ్లికి వ‌చ్చిన అతిధుల్ని ప‌లుక‌రించ‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అలా దాదాపు అర‌గంట‌కు పైనే వేదిక మీద రామోజీతో ఉన్న చంద్ర‌బాబు ఆ త‌ర్వాత కింద‌కు దిగి వెళ్లారు. ఏదైనా పెళ్లి వేడుక‌కు రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు వ‌స్తే..వారు రావ‌ట‌మే గొప్ప‌గా ఉంటుంది. వారు రావ‌టం.. వ‌ధూవ‌రుల్ని ఆశీర్వ‌దించ‌టం.. ఫోటోల‌కు ఫోజులు ఇవ్వ‌టం వెళ్లిపోవ‌టం జ‌రుగుతుంది. కానీ.. అందుకు భిన్నమైన దృశ్యం రామోజీ ఇంట జ‌రిగిన పెళ్లిలోనే ఆవిష్కృత‌మైంద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు