ఘోరాతి ఘోరమైన ఫ్లాప్‌

ఘోరాతి ఘోరమైన ఫ్లాప్‌

ఎక్కువ థియేటర్లలో సినిమా విడుదల చేయడం, బాగా హైప్‌ చేసి వదలడం వల్ల ఈమధ్య పెద్ద సినిమాలకి ఓపెనింగ్స్‌ వరకు ఢోకా ఉండడం లేదు. ఎంత బ్యాడ్‌ టాక్‌ వచ్చినా కానీ వారం రోజుల పాటు బండి గెంటేస్తున్నాయి. తక్కువలో తక్కువ పాతిక కోట్లు అయితే పెద్ద సినిమాలకి గ్యారెంటీగా తిరిగొస్తున్నాయి. కానీ ఇలాంటి మంచి టైమ్‌లో కూడా 'షాడో' సినిమా అత్యంత ఘోరమైన ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రం టోటల్‌ కలెక్షన్స్‌ పది కోట్ల మార్కు చేరడం కూడా చాలా కష్టమని తేలిపోయింది. 

వెంకటేష్‌కి రీసెంట్‌ టైమ్స్‌లో ఇంతటి ఘోరమైన ఫ్లాప్‌ రాలేదు. ముప్పయ్‌ అయిదు కోట్లకి పైగా ఖర్చయిన ఈ చిత్రం డెఫిసిట్‌లో రిలీజ్‌ అయింది. సినిమా బాగా ఆడితే ఓవర్‌ ఫ్లోస్‌ ద్వారా గట్టెక్కవచ్చునని నిర్మాత ఆశించారు. కానీ ఈ సినిమా కొన్న బయ్యర్లే దారుణంగా నష్టపోతున్నారు. ఇప్పుడు వారికే నష్టాన్ని పూరించాల్సిన భారం నిర్మాతపై పడింది. ఇంతకుముందు నా ఇష్టం సినిమా తీసి అయిదు కోట్లకి పైగా నష్టపోయిన షాడో నిర్మాతలు ఈ దెబ్బతో మరింత దారుణమైన ఇబ్బందుల్లో పడిపోయారు. సినిమా రిలీజ్‌ అయితే కష్టాలు గట్టెక్కుతాయని అనుకుంటే ఇప్పుడవి ఎన్నో రెట్లు పెరిగిపోయాయి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు