బన్నీ సౌండ్ లేకుండా సినిమా చూశాడట..

బన్నీ సౌండ్ లేకుండా సినిమా చూశాడట..

మెగా ఫ్యామిలీ అంతా ఇప్పుడు సంతోషంలో మునిగిపోయి ఉంది. ఇప్పటిదాకా కెరీర్లో సరైన కమర్షియల్ సక్సెస్ లేక.. అందులోనూ గత రెండు సినిమాలు 'లోఫర్', 'మిస్టర్' చేదు అనుభవాలు మిగల్చడంతో నైరాశ్యంలో కూరుకుపోయి ఉన్న వరుణ్ తేజ్ ఎట్టకేలకు 'ఫిదా'తో సూపర్ హిట్ అందుకున్నాడు.

చిన్న సినిమా అనుకున్న 'ఫిదా' ఇప్పుడు పెద్ద స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే 'ఫిదా' సక్సెస్ అయినందుకు అందరి కంటే వరుణ్ విషయంలో తనకు చాలా హ్యాపీగా ఉందన్నాడు రాజు. 'ఫిదా' ద్వారా మెగా హీరోలందరికీ హిట్టిచ్చిన ఘనత తన సొంతమైందన్నాడు రాజు.

మామూలుగా తాను తన సినిమాలన్నింటిలో జోక్యం చేసుకుంటానని.. దర్శకుడు ఎవరైనా సరే.. ఏదో ఒక దశలో తన జోక్యం ఉంటుందని.. కానీ 'ఫిదా'కు మాత్రం అలా జరగలేదని.. తాను జోక్యం చేసుకుంటే ఇది కిచిడీ అయిపోతుందన్న ఉద్దేశంతో తాను పూర్తిగా దూరంగా ఉండిపోయానని.. ఇంతకుముందు అన్నట్లే ఇది పక్కా శేఖర్ కమ్ముల సినిమా అని రాజు తెలిపాడు. కథ విని ఓకే చేశాక.. నటీనటుల ఎంపికలో కూడా తాను జోక్యం చేసుకోలేదని.. సినిమా అంతా అయ్యాక ఫస్ట్ కాపీ చూశానని.. శేఖర్ మీద పెట్టుకున్న నమ్మకం నిలబడిందని.. ఆ తర్వాత మెగా ఫ్యామిలీలో ఒక్కొక్కరికే సినిమా చూపించానని రాజు తెలిపాడు.

నాగబాబుకు సినిమా బాగా నచ్చాక.. ఆ తర్వాత అల్లు అర్జున్ ఫ్యామిలీకి సినిమా చూపించానని.. ఐతే వాళ్లు ప్రివ్యూ థియేటర్లో సినిమా చూస్తుండగా.. సౌండ్ సిస్టమ్ దెబ్బ తిందని.. కానీ అలాగే సినిమా చూశారని.. తర్వాత బయటికి వచ్చి సౌండ్ లేకుండా చూసినా ఎమోషన్ క్యారీ అయిందని.. సినిమా చాలా బాగుందని చెప్పారని రాజు వెల్లడించాడు. తొలి రోజు సుదర్శన్ థియేటర్లో తాను, శేఖర్ కమ్ముల కలిసి సినిమా చూస్తుండగా జనాల రెస్పాన్స్ చూస్తే ఈ సినిమా రేంజే వేరుగా ఉండబోతోందని.. బ్లాస్ట్ కాబోతోందని తనకు అర్థమైందని రాజు తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English