రామ్‌ చరణ్‌ కోసం ఇది హిట్టవ్వాలి!

రామ్‌ చరణ్‌ కోసం ఇది హిట్టవ్వాలి!

'రచ్చ'తో ఒక స్టార్‌ హీరోని హ్యాండిల్‌ చేయగలనని, ఒక కమర్షియల్‌ విజయాన్ని అందించగలనని నిరూపించుకున్నాడు సంపత్‌ నంది. ఆ వెంటనే పవన్‌కళ్యాణ్‌తో పని చేసే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. పవన్‌తో ఛాన్స్‌ మిస్‌ అయినా, రవితేజ, గోపిచంద్‌లతో సినిమాలు తీసి బిజీగానే వున్నాడు సంపత్‌ నంది.

అయితే చరణ్‌ తర్వాత పెరగాల్సిన తన గ్రాఫ్‌ తగ్గింది. స్టార్‌ హీరోలతో కాకుండా, ఫేడవుట్‌ అయిన మిడ్‌ రేంజ్‌ హీరోలతో సినిమాలు తీసాడు. తనని ఇప్పుడు స్టార్లు గుర్తించాలంటే 'గౌతమ్‌ నంద' ఖచ్చితంగా పెద్ద హిట్‌ అవ్వాలి. 'రచ్చ' తర్వాత కూడా సంపత్‌తో చరణ్‌ టచ్‌లోనే వున్నాడు కానీ ఆఫర్‌ మాత్రం ఇవ్వడం లేదు.

అతని కోసమే ఒక కథ రాస్తోన్న సంపత్‌ నంది త్వరలోనే చరణ్‌ నుంచి పిలుపు వస్తుందని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాడు. చరణ్‌కి ఇప్పుడు వున్న కమిట్‌మెంట్స్‌ మధ్య సంపత్‌ని పిలిపించడం జరిగేటట్టు కనిపించడం లేదు. అదే 'గౌతమ్‌ నంద' పెద్ద హిట్‌ అయితే ఆటోమేటిగ్గా చరణ్‌కి సంపత్‌ గుర్తొస్తాడు. చరణ్‌ దృష్టిని తనవైపుకి తిప్పుకోవడానికి అయినా ఈ చిత్రం ఘన విజయం సాధించాలని సంపత్‌ ఆశిస్తున్నాడు.

ఇకపోతే ఈ చిత్రాన్ని తన మునుపటి చిత్రాల్లా కమర్షియల్‌గా డీల్‌ చేయలేదని, కథాబలం వున్న సినిమాగా మలిచానని, అందుకే ఫలితంపై టెన్షన్‌గా వుందని చెప్పాడు. అతని టెన్షన్‌ తీరిపోతుందా లేదా అనేది మరికొద్ది గంటల్లో తెలిసిపోతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English