వరుణ్‌తేజ్‌కి ఆ ముచ్చట తీరిపోయిందోచ్‌

వరుణ్‌తేజ్‌కి ఆ ముచ్చట తీరిపోయిందోచ్‌

కెరియర్లో తొలి విజయాన్ని అందుకున్న కొణిదెల వరుణ్‌ తేజ్‌ అలాంటిలాంటి హిట్టు కొట్టలేదు. ఫిదా వసూళ్లు అందరినీ సంభ్రమాశ్చర్యాలకి గురి చేస్తున్నాయి. ఇవాళ డ్రాప్‌ అవుతుందేమో అనుకుంటే, ఇవాళ డ్రాప్‌ అవుతుందని అనుకుంటూ ఎదురు చూస్తూ వుండగానే వారం గడిచిపోయింది. ఆరు రోజుల్లో ఇరవై ఒక్క కోట్ల షేర్‌ వసూలు చేసి వరుణ్‌ తేజ్‌ని ఇరవై కోట్ల క్లబ్‌లో చేర్చేసింది.

కొత్తగా హీరోగా పరిచయమైన ఎవరికైనా కానీ ఇరవై కోట్ల క్లబ్‌లో చేరడమనేది పెద్ద అఛీవ్‌మెంట్‌. మధ్య శ్రేణి హీరోలకి ఇరవై కోట్ల వసూళ్లు వస్తే మిడిల్‌ రేంజ్‌లో స్టార్స్‌ కిందే లెక్క. అయితే ఫిదా కేవలం ఇరవై కోట్లతో సరిపెట్టేలా లేదు. ఆదివారానికి ఇరవై అయిదు కోట్ల షేర్‌ రావడం లాంఛనమే కాగా, ముప్పయ్‌ కోట్ల షేర్‌ అవలీలగా దాటిపోతుంది.

నైజాంలో ఆరు రోజుల్లో ఏడు కోట్ల ముప్పయ్‌ లక్షలు వసూలు చేసిన ఈ చిత్రం ఫుల్‌ రన్‌లో మరో ఏడు కోట్లు సాధిస్తుందని అంటున్నారు. మరోవైపు ఓవర్సీస్‌లో ఈ చిత్రం వసూళ్ల జోరు అస్సలు తగ్గడం లేదు. నిన్ను కోరి చిత్రానికి ఆరంభంలో వసూళ్లు వచ్చినా తర్వాత సద్దుమణిగాయి. కానీ బుధవారం కూడా యాభై వేలకి పైగా డాలర్లు వసూలు అవడంతో సెకండ్‌ వీకెండ్‌లో కనీసం అర మిలియన్‌ వసూలవుతుందని అంచనా వేస్తున్నారు. రెండు మిలియన్‌ డాలర్లు సాధించడం కష్టమేం కాదనేది లేటెస్ట్‌ ఎస్టిమేషన్‌!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు