ప్రమోట్ చేసుకోవడంలో బన్నీ తర్వాతే..

ప్రమోట్ చేసుకోవడంలో బన్నీ తర్వాతే..

అల్లు అర్జున్ అమెరికా యాత్ర గురించి రెండు రోజులుగా మోతెక్కిపోతున్నాయి వార్తలు. తన సినిమాలకు సంబంధించి అల్లు అర్జున్ దేన్నయినా భలేగా ప్రమోట్ చేసుకుని.. మార్కెట్ చేసుకుంటాడనడానికి ఇది తాజా రుజువు. నిజానికి బన్నీ కొత్తగా బాడీ పెంచేదేమీ లేదు. ఫిజిక్ మార్చుకునేదేమీ లేదు. ఎప్పుడో ‘దేశముదురు’ రోజుల్లోనే సిక్స్ ప్యాక్ ట్రై చేశాడు బన్నీ.

లోకల్ ట్రైనర్ల సాయంతోనే అదిరిపోయే లుక్‌లోకి మారాడు. తర్వాత ‘బద్రీనాథ్’.. ‘సరైనోడు’ లాంటి సినిమాల కోసం కూడా బాడీ పెంచాడు. మంచి లుక్‌లో కనిపించాడు. ఆల్రెడీ ‘సరైనోడు’లో బన్నీ మిలిటరీ నుంచి వచ్చిన కుర్రాడిగానే కనిపించాడు. ఇప్పుడు ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లోనూ బన్నీ సైనికుడి పాత్ర చేస్తున్నట్లుగా చెబుతున్నారు. దాని కోసమే అమెరికా ట్రైనింగ్ అంటున్నారు.

మరి బన్నీ కొత్తగా అమెరికా వెళ్లి బాడీ, బాడీ లాంగ్వేజ్ విషయంలో ఏం ట్రైన్ అయిపోతాడో.. ఈ సినిమాలో ఎంత కొత్తగా కనిపిస్తాడో చూడాలి. ఇక్కడ లేని ట్రైనర్లా.. ఇక్కడ లేని శిక్షణలా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. కానీ బన్నీ అండ్ కో అదేమీ పట్టించుకోవడం లేదు. బన్నీ అమెరికా యాత్ర గురించి అతడి పీఆర్ టీం గట్టిగా ప్రచారం చేయడంలో, దాన్ని మీడియాలో చర్చనీయాంశం చేయడంలో బాగానే సక్సెస్ అయింది.

సినిమా మొదలు కాకముందే ఈ రకంగా ప్రమోషన్ మొదలుపెట్టేశారన్నమాట. గత కొన్నేళ్లలో ఈ రకం ప్రమోషన్లతోనే బన్నీ ఎదిగాడు. తన సినిమాలు ఎప్పుడూ వార్తల్లో ఉండేలా.. ఎక్కువమందికి దాని సమాచారం చేరి ఆసక్తి పెరిగేలా చూసుకున్నాడు. తన రేంజి పెంచుకున్నాడు. ‘నా పేరు సూర్య..’ విషయంలోనూ అదే ఒరవడి కొనసాగిస్తున్నట్లున్నాడు బన్నీ. మరి అమెరికా నుంచి వచ్చాక బన్నీలో ఎలాంటి మార్పు వస్తుందో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు