సెప్టెంబర్లో ఖాళీ ఎక్కడుంది బాబూ..

సెప్టెంబర్లో ఖాళీ ఎక్కడుంది బాబూ..

ఒకప్పుడు కామెడీ హీరో అల్లరి నరేష్ ఏడాదికి కనీసం మూడు రిలీజులుండేలా చూసుకునేవాడు. ఒక సినిమా రెడీ చేసేలోపు రెండు సినిమాలకు రంగం సిద్ధమమ్యేది. మూణ్నాలుగు నెలలకో సినిమా పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసేవాడు అల్లరోడు. ఐతే రొటీన్ సినిమాలతో విసుగెత్తించేయడంతో అతడికి ప్రేక్షకుల నుంచి తిరస్కారం ఎదురైంది. నెమ్మదిగా సినిమాలు తగ్గిపోయాయి. ఐతే ఇప్పుడు టాలీవుడ్లో నరేష్ తర్వాత అంత స్పీడు చూపిస్తున్నదంటే నారా రోహితే.

గత ఏడాది అతను నటించిన ఆరు సినిమాలు రిలీజయ్యాయంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఐతే వాటిలో నాలుగు సినిమాలు దెబ్బేసేశాయి. ఏడాది ఆఖర్లో ‘జ్యో అచ్యుతానంద’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ హిట్టవడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న రోహిత్.. ఇప్పుడు మళ్లీ స్పీడు పెంచేశాడు. ఆల్రెడీ ఈ నెలలోనే ‘శమంతకమణి’ రిలీజైంది. ఆగస్టులో ‘కథలో రాజకుమారి’ రాబోతోంది. ఇంతలోనే సెప్టెంబర్ రిలీజ్ అంటూ ‘బాలకృష్ణుడు’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు. నిన్న రిలీజైన ఈ పోస్ట‌ర్లో సెప్టెంబ‌ర్ రిలీజ్ అని ప్ర‌క‌టించారు.

ఐతే సెప్టెంబ‌ర్లో ఎక్క‌డ ఖాళీ ఉంద‌ని ఇంత ధైర్యంగా ప్ర‌క‌ట‌న ఇచ్చేశారో మ‌రి. ఎన్టీఆర్ ‘జై ల‌వకుశ’, మ‌హేష్ బాబు ‘స్పైడ‌ర్’, బాల‌య్య ‘పైసావ‌సూల్’ ఆ నెల‌లోనే రాబోతున్నాయి. ఇవి కాక సాయిధ‌ర‌మ్ తేజ్ ‘జ‌వాన్’ కూడా రేసులో ఉంది. ఇంకో రెండు మూడు మీడియం రేంజి సినిమాలు ఆల్రెడీ సెప్టెంబ‌రుపై క‌న్నేశాయి. ఇన్ని సినిమాల మ‌ధ్య ‘బాల‌కృష్ణుడు’ను ఎలా రిలీజ్ చేసుకుంటాడో నారా బాబు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English