ఛార్మీ... వై దిస్‌ కొలవెరి?

ఛార్మీ... వై దిస్‌ కొలవెరి?

సినీ పరిశ్రమకి చెందిన చాలా మందికి డ్రగ్స్‌ కేసు విషయంలో నోటీసులు అందాయి. ఒక్కొక్కరుగా వెళ్లి విచారణకి సహకరిస్తున్నారు తప్ప ఎవరూ స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌కి (సిట్‌) ఎదురు తిరగలేదు. అయితే ఛార్మి మాత్రం ఈ వ్యవహారంలో అతిగా స్పందించింది. తన రక్త నమూనాలు కానీ, గోళ్లు వగైరా కానీ తన అనుమతి లేకుండా తీసుకోరాదని కోర్టుకి ఎక్కింది. ఆమె అనుమతి లేకుండా అవేమీ చేయవద్దని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అయితే అసలు సిట్‌ అధికారులు ఎవరినుంచీ బలవంతంగా శాంపిల్స్‌ తీసుకోలేదు. హాజరైన వారికి ఇష్టమైతేనే శాంపిల్స్‌ తీసుకున్నారు తప్ప ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టలేదు.

అయినప్పటికీ ఛార్మి ఈ విషయంలో ఓవర్‌గా రియాక్ట్‌ అయింది. దాని వల్ల ఆమె వైపు తప్పు వుందని అనిపించిందే తప్ప జనాల్లో సింపతీ ఏమీ రాలేదు. మిగతా ఎవరికీ లేని అభ్యంతరం తనకే వుందంటే తనలో తప్పు వుందనేగా అంటూ ఆమె చర్యని చాలా మంది తప్పుబట్టారు. తాజాగా సిట్‌ కార్యాలయం వద్ద ఒక పోలీస్‌ తనతో అనుచితంగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసి ఛార్మి మళ్లీ వార్తల్లోకెక్కింది. విక్టిమ్‌ కార్డ్‌ ప్లే చేస్తోందని, విషయాన్ని డ్రమెటైజ్‌ చేసి సిట్‌ అధికారులని డిఫెన్స్‌లోకి నెట్టడానికి ప్రయత్నిస్తోందని ఆమె అభియోగాల పట్ల పబ్లిక్‌ రెస్పాండ్‌ అవుతున్నారు.

ఏ గొడవా లేకుండా సింపుల్‌గా వాళ్లు అడిగిన దానికి సమాధానాలిచ్చేసి వచ్చేస్తే పోయేదానికి అనసవసరంగా పబ్లిక్‌ దృష్టిలో దోషిగా కనిపించేందుకు ఛార్మి ట్రై చేయడం విచిత్రంగా తోస్తోంది. సాయంత్రం అయిదు గంటల వరకే విచారించాలనే కోర్టు తీర్పుతో ఛార్మిని రెండవ రోజు కూడా పిలిపించబోతున్నారనేది ప్రచారంలో వుంది. ఒక్క రోజులో పోయేదానిని పొడిగించుకోవడమంటే ఇదే మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు