ఛార్మి.. కెల్విన్ మ‌ధ్య అన్ని వంద‌ల వాట్సాప్ మేసేజ్ లా?

ఛార్మి.. కెల్విన్ మ‌ధ్య అన్ని వంద‌ల వాట్సాప్ మేసేజ్ లా?

డ్ర‌గ్స్ విచార‌ణ ఎంత‌టి సంచ‌ల‌నానికి కార‌ణం అవుతుంద‌న్న విష‌యం తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంలో ఇప్ప‌టివ‌ర‌కూ ప‌లువురు సినీ ప్ర‌ముఖులు విచార‌ణ‌కు అధికారుల ముందు హాజ‌రైనా.. తొలిసారి మాత్రం ఒక న‌టి హాజ‌రైంద‌ని చెప్పాలి. ప్ర‌ముఖ హీరోయిన్ గా సుప‌రిచితురాలు ఛార్మి తాజాగా సిట్ విచార‌ణ‌లో అధికారుల ప్ర‌శ్న‌ల్ని ఎదుర్కొంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఛార్మికి సంబంధించి కొన్ని విష‌యాలు బ‌య‌ట‌కు రావ‌టం సంచ‌ల‌నంగా మారింది.

డ్ర‌గ్స్ ఉదంతంలో ప్ర‌ధాన‌నిందితుడిగా భావిస్తున్న కెల్విన్ ఫోన్లో ఛార్మి పేరు ఛార్మి దాదా అని రాసి ఉంద‌ని తెలుస్తోంది. అంతే కాదు.. అత‌డి ఫోన్లోని వాట్సాప్ మెసేజ్ ల‌లో వెయ్యికి పైగా సంభాష‌ణ‌లు వీరిద్ద‌రి మ‌ధ్య సాగిన‌ట్లుగా స‌మాచారం. అంత సుదీర్ఘంగా వారి మ‌ధ్య సంభాష‌ణ‌లు సాగ‌టం వెనుక కార‌ణం ఏమిట‌న్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అంతేకాదు.. ఆమె న‌టించిన జ్యోతిల‌క్ష్మి సినిమా ఫంక్ష‌న్లో కెల్విన్ తో క‌లిసి ఛార్మి ఫోటోలు దిగిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. ఇదిలా ఉంటే.. ఛార్మిని విచారిస్తున్న సిట్ అధికారులు.. గ‌తంలో తాము విచారించిన పూరీ.. సుబ్బ‌రాజు.. న‌వ‌దీప్ లాంటి వారు చెప్పిన స‌మాచారాన్ని ఛార్మితో క్రాస్ చెక్ చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

ఛార్మి కోరిన‌ట్లే ఆమెను న‌లుగురు మ‌హిళా సిట్ అధికారిణులు విచారిస్తున్నారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూప‌రింటెండెంట్ అనిత‌.. జ‌య‌ల‌క్ష్మి.. రేణుక‌.. శ్రీల‌తలు ఛార్మిని విచారిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. కోర్టు సూచ‌న ప్ర‌కారం ఆమెను ఈ రోజు సాయంత్రం ఐదు గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే విచారిస్తార‌ని చెబుతున్నారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. ఛార్మి విచార‌ణ రేపు కూడా కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఈ విష‌యంపై సాయంత్రానికి మ‌రింత స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌న్న మాట వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు