నందమూరి హీరో కోసం నాని!

నందమూరి హీరో కోసం నాని!

రవితేజతో 'కిక్‌ 2' తీసిన నందమూరి కళ్యాణ్‌రామ్‌ ప్రస్తుతం జూనియర్‌ ఎన్టీఆర్‌తో 'జై లవకుశ' చిత్రాన్ని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై రూపొందిసున్నాడు. ఇకపై ఇతర హీరోలతో తన నిర్మాణంలో రెగ్యులర్‌గా సినిమాలు చేయాలని అనుకుంటున్నాడట. ఇందులో భాగంగా త్వరలో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌పై నాని హీరోగా ఒక సినిమా మొదలవుతుందని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా వున్న నాని ఖాళీ అవ్వాలంటే కనీసం ఏడాది సమయం పడుతుంది. ఏడాది తర్వాతే ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్లో ఈ సినిమా వుంటుందని, ఆల్రెడీ మాటలు అయిపోయాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.  ప్రస్తుతం నానికి వున్న డిమాండ్‌ ఏమిటనేది ఈ వార్తని బట్టి తెలుస్తోంది.

కళ్యాణ్‌రామ్‌ కావాలనుకుంటే చాలా మంది హీరోలు దొరుకుతారు కానీ ముందుగా నానితోనే చేద్దామని అతను ఫిక్సయ్యాడట. ఈ సినిమా కోసం కథ, దర్శకుడి కోసం వేట కూడా మొదలు పెట్టాడట. 'కృష్ణగాడి వీర ప్రేమగాధ'లో నందమూరి బాలకృష్ణ వీరాభిమానిగా కనిపించిన నాని ఇప్పుడు ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌లో సినిమా చేస్తే ఇక నందమూరి ఫాన్స్‌ అతడిని ఓన్‌ చేసేసుకుంటారేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు