రోజుకు 20వేల ముద్దులు పెడుతుంద‌ట‌

రోజుకు 20వేల ముద్దులు పెడుతుంద‌ట‌

బాలీవుడ్ సోయ‌గం క‌రీనాక‌పూర్‌. పెళ్లి చేసుకున్న‌ప్ప‌టికీ.. త‌న అందాల‌తో కిక్కు ఎక్కించే గ‌మ్మ‌త్తు ఆమెదే. ఇటీవ‌ల బుజ్జి బాబుకు జ‌న్మ‌నిచ్చిన క‌రీనా.. గ‌డిచిన కొంత‌కాలంగా సినిమాల‌కు దూరంగా ఉంటోంది. ఇంట్లో పిల్లాడి ముద్దు ముచ్చ‌ట్లు చూసుకుంటూ.. అప్పుడ‌ప్పుడు మీడియాకు ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలు ఇస్తున్న ఈ ఆంటీ తాజాగా ఒక ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చింది.

ఈ సంద‌ర్భంగా త‌న కొడుకు గురించి చెప్పుకొచ్చింది. త‌న ముద్దుల కొడుకు తైమూర్ క్రేజ్ రోజురోజుకి పెరిగిపోతోంద‌ని.. అత‌గాడి ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్ర‌తిసారీ అభిమానులు పిల్లాడి అందాల‌కు ఫిదా అవుతున్న‌ట్లుగా చెప్పింది. అంతేకాదు.. రోజుకు క‌నీసం 20వేల ముద్దులు త‌న కొడుక్కి ఇస్తున్న‌ట్లుగా అతిశ‌య‌పు మాట‌ల్ని చెప్పింది. తైమూర్ ఎప్పుడూ ఆడుకుంటూనే ఉంటాడ‌ని.. వాడిలో త‌న‌కు న‌చ్చ‌ని విష‌యం ఏమిటంటే.. రోజుకు తాను 20వేల సార్లు ముద్దుపెట్టుకోవ‌టంగా చెప్పుకొచ్చింది.

త‌న‌ను ముద్దు పెట్టుకోనీవ్వ‌కుండా దూరంగా తోస్తుంటాడ‌ని.. అలా ఎందుకు చేస్తుంటాడ‌ని సైఫ్ ను తాను ప్ర‌శ్నిస్తాన‌ని వెల్ల‌డించింది. ముద్దు చేయటం త‌ప్పేం కాదు.. కానీ అదే ప‌నిగా వేలాది ముద్దులు పెడితే బుజ్జి ప్రాణానికి చిరాకు పుట్ట‌కుండా ఉంటుందా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English