ఈ గోలలో నితిన్‌కే హోల్‌!

ఈ గోలలో నితిన్‌కే హోల్‌!

వరుసగా నాలుగు రోజుల సెలవులు వచ్చేసరికి ఎవరికి వారు ఆ వీకెండ్‌ని క్యాష్‌ చేసేసుకోవాలని చూస్తున్నారు. దీంతో ఆగస్టు 11న మొత్తం మూడు సినిమాలో బరిలో నిలిచాయి. 'నేనే రాజు నేనే మంత్రి' నిర్మాతలు ఆగస్టు 11న రిలీజ్‌ చేస్తున్నట్టు ప్రకటించేసారు. దీంతో ముందు నుంచీ అదే డేట్‌ని టార్గెట్‌ చేస్తోన్న నితిన్‌ 'లై' చిక్కుల్లో పడింది.

ఆల్రెడీ ఆ డేట్‌కి బోయపాటి శ్రీను 'జయ జానకి నాయక' కూడా వస్తోంది. దానికి తోడు ఆగస్టు 4న మరో రెండు సినిమాలు విడుదలకి సిద్ధమవుతున్నాయి. ఇటు చూస్తే ఫిదా కూడా అప్పటికి ఇంకా థియేటర్లలోనే వుండేట్టు వుంది. ఈవారం వచ్చే గౌతమ్‌ నంద కూడా అప్పటికి కంటిన్యూ అవుతుంటుంది. దీంతో థియేటర్ల పరంగా తీవ్రమైన కొరత ఏర్పడుతుంది. ఈ రసాభాసలో ఎక్కువగా నష్టపోయేది నితిన్‌ అని ట్రేడ్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

లై చిత్రం బడ్జెట్‌కి, రేంజ్‌కి కనీసం తెలుగు రాష్ట్రాల్లో ఏడెనిమిది వందల థియేటర్లు అవసరం. అలాగే మల్టీప్లెక్సుల్లో మాగ్జిమం షోలు కూడా వేసుకుని తీరాలి. లేదంటే ఆ బడ్జెట్‌కి వర్కవుట్‌ కాదు. కానీ ఇంత రష్‌ వుంటే అన్ని థియేటర్లు దొరకడం అసాధ్యం. మిగతా సినిమాల బడ్జెట్‌ స్కేల్‌ ప్రకారం మీడియర రిలీజ్‌ అయినా వర్కవుట్‌ అయిపోతుందట. కానీ నితిన్‌ 'లై'కి స్పేస్‌ వుండాలని విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు ఆయా చిత్రాల నిర్మాతలు ఏమైనా రాజీ పడి ఒకరిద్దరు వెనక్కి తగ్గితే తప్ప హూల్‌సేల్‌గా పలువురికి హోల్‌ పడడం ఖాయం అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు