మీడియాపై మండిప‌డ్డ న‌వ‌దీప్‌!

మీడియాపై మండిప‌డ్డ న‌వ‌దీప్‌!

డ్ర‌గ్స్ కేసులో విచార‌ణ కోసం సోమ‌వారం సిట్ ఎదుట హీరో న‌వ‌దీప్ హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. విచార‌ణ సంద‌ర్భంగా న‌వ‌దీప్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడ‌ని, చాలా చాక‌చ‌క్యంగా జ‌వాబులిచ్చార‌ని కొన్ని చానెళ్ల‌లో వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో మీడియా తీరుపై న‌వ‌దీప్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. డ్ర‌గ్స్ కేసులో విచార‌ణ‌కు హాజ‌రైన సంద‌ర్భంగా మీడియా తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న ఆవేద‌న‌ను వెళ్ల‌గ‌క్కాడు.

డ్రగ్స్‌ కేసులో తనను సిట్‌ అధికారులు విచారించిన విధానంపై మీడియా అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించింద‌న్నాడు. కొన్ని చానెళ్ల‌లో త‌న‌పై వ‌చ్చిన‌ వార్తలు చూసి ఆశ్చ‌ర్య‌పోయాన‌న్నాడు. సాధారణ ప్రజలు అమాయకులన్న భ్రమలో మీడియా ఉందని ట్వీట్ చేశాడు. తాము రాసిన , ప్ర‌సారం చేసిన కథనాలను ప్రజలు గుడ్డిగా నమ్ముతారన్న విశ్వాసంతో ఉన్నట్టు కనబడుతోందన్నాడు. ప్రభుత్వ వ్యవస్థలపై కనీసం గౌరవం లేనట్టుగా మీడియా ప్రవర్తిస్తోందని మండిపడ్డాడు. దర్యాప్తు కొనసాగుతుండగా త‌మ‌కు తోచిన విధంగా ఊహాగానాలు, తమకు అందిన సమాచారం అంటూ ఇష్టానుసారంగా రాయడం సమంజసం కాదని నవదీప్‌ ట్వీట్‌ చేశాడు. దర్యాప్తులో భాగంగా ఆయన సోమవారం సిట్‌ అధికారుల ఎదుట హాజరయిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా రక్త నమూనాలు ఇవ్వడానికి నవదీప్‌ నిరాకరించాడు.

కాగా, మంగళవారం ఆర్ట్‌ డైరెక్టర్‌ ధర్మారావు అలియాస్‌ చిన్నాను సిట్‌ అధికారులు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.45 గంటల ప్ర‌శ్నించారు. కెల్విన్‌తో సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి? ఎప్పటినుంచి డ్రగ్స్‌ వాడుతున్నారు? సినీ పరిశ్రమలో ఇంకా ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటున్నారు? తదితర ప్రశ్నలను సిట్‌ అధికారులు చిన్నాను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. చిన్నా నుంచి వివరాలు రాబట్టిన సిట్‌ అధికారులు నాలుగు గంట‌ల్లోనే ఆయ‌న‌ విచారణను ముగించారు. డ్రగ్స్‌ వ్యవహారంతో పెద్దగా సంబంధాలు లేవనే ఉద్దేశంతోనే చిన్నా విచారణను త్వరగా విచారించార‌న్నవాద‌న‌లు వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు