జగన్‌ జిత్తులు పని చేస్తాయా?

జగన్‌ జిత్తులు పని చేస్తాయా?

రెండు భారీ బడ్జెట్‌ చిత్రాలతో పాటు దసరా బరిలోకి దిగుతోన్న బాలయ్య చిత్రం 'పైసా వసూల్‌'కి క్రేజ్‌ తేవడం కోసం పూరి జగన్నాథ్‌ కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నాడు. ఈ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్‌ అయినపుడు వచ్చిన క్రేజ్‌ ఆ తర్వాత నిలబడలేదనేది వాస్తవం. ముఖ్యంగా బాలయ్య గెటప్‌ కానీ, టైటిల్‌ కానీ ఎవరినీ ఎక్సయిట్‌ చేయలేదు. దానికి తోడు జై లవకుశ, స్పైడర్‌తో పాటు దసరాకి వస్తుందనగానే బజ్‌ బాగా తగ్గింది.

పూరి జగన్నాథ్‌ రీసెంట్‌ సినిమాలు చూసిన వారు అతడి నుంచి అద్భుతాలు ఆశించలేరు. కానీ పూరి జగన్నాథ్‌ మాత్రం తన మాటలతో గారడీ చేసేస్తానని, బాలయ్యని ఎవరూ చూపించని స్టయిల్లో చూపించి మార్కులు కొట్టేస్తానని అంటున్నాడు. ఎన్టీఆర్‌, మహేష్‌ చిత్రాలతో పోటీ అనగానే పైసా వసూల్‌ వీక్‌ మూవీ అయిపోయింది. దీంతో పబ్లిసిటీ పరంగా ఎప్పుడూ అంత దృష్టి పెట్టని పూరి జగన్నాథ్‌ దీనిని ప్రెస్టీజియస్‌గా తీసుకున్నాడు.

అదీ కాక రీసెంట్‌ డ్రగ్‌ స్కాండల్‌ గొడవ వల్ల తన పరపతి పడిపోవడంతో తిరిగి తన గౌరవం సాధించుకోవడానికి హిట్టు సినిమా ఇవ్వడమే కరెక్టని అనుకుంటున్నాడు. అయితే ఇలాంటి ట్రిక్కులన్నీ ప్రేక్షకులని థియేటర్లకి రాబట్టడానికి పనికొస్తాయా? రెండు భారీ సినిమాల మధ్య పైసా వసూల్‌కి పైసలు వసూలైపోతాయా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు