నందమూరి తారక 'రావణాసురుడి' వీరంగం

నందమూరి తారక 'రావణాసురుడి' వీరంగం

'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' అనే భయంకరమైన డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో ఎన్టీఆర్‌ సినిమా అనగానే ఫాన్స్‌కే నీరసమొచ్చింది. అయితే కంటెంట్‌ వున్న హీరోకి కటౌట్‌ సరిపోద్దని చాలాసార్లు రుజువైంది. దర్శకుడెవరు అనేది లేకుండా కేవలం ఎన్టీఆర్‌ని చూసి ఈ చిత్రాన్ని తారాస్థాయిలో కొనేస్తున్నారు.

జిఎస్‌టీ కారణంగా తగ్గిన షేర్లు కూడా బయ్యర్లని తగ్గనివ్వలేదు. ఈ చిత్రంపై అపారమైన నమ్మకమున్న కళ్యాణ్‌రామ్‌ తను అడిగినంత ఇస్తేనే రైట్స్‌ ఇస్తానని పట్టుబట్టి కూర్చున్నాడు. 'జై లవకుశ'లో 'జై'గా మోడ్రన్‌ రావణాసురుడిగా ఎన్టీఆర్‌ని చూసిన తర్వాత దీనిపై అంచనాలు గణనీయంగా పెరిగిపోయాయి. చాలా టెంప్టింగ్‌గా కనిపిస్తోన్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్‌ చేసేస్తుందని బయ్యర్లు ఫిక్స్‌ అయిపోయారు.

దీంతో కళ్యాణ్‌రామ్‌ అడిగినంత రేట్లు చెల్లించి రైట్స్‌ పట్టుకుపోయారు. ఏపీ, నైజాం కలిపి డెబ్బయ్‌ కోట్లకి ఈ చిత్రం హక్కులు అమ్మారంటే అది కేవలం ఎన్టీఆర్‌ స్టార్‌డమ్‌ వలనే అంటే అతిశయోక్తి కాదు. మరోవైపు మురుగదాస్‌ లాంటి ఉద్ధండ దర్శకుడు వున్నప్పటికీ స్పైడర్‌కి ఈ స్థాయి బిజినెస్‌ జరగడం లేదు. కేవలం ఎన్టీఆర్‌కి వున్న మాస్‌ ఫాలోయింగే దర్శకుడితో పని లేకుండా జై లవకుశకి ఇంత క్రేజ్‌ తెచ్చిపెట్టిందని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.