బాలకృష్ణ లుక్‌ పై సందేహాలు

బాలకృష్ణ లుక్‌ పై సందేహాలు

ప్రస్తుత యువ కథానాయకుల్లో శరవేగంగా సినిమాలు చేసే హీరో అంటే నారా రోహితే. పోయినేడాది అతడి సినిమాలు ఆరు రిలీజవడం విశేషం. ఈ ఏడాది కూడా మూడు రిలీజ్‌లుండేలా ప్లాన్ చేసుకున్నాడతను. ఆల్రెడీ ‘శమంతకమణి’ ప్రేక్షకుల ముందుకు రాగా.. వచ్చే నెలలో ‘కథలో రాజకుమారి’ విడుదల కానుంది. వీటి మీద డిస్కషన్లు జరుగుతుండగానే ‘బాలకృష్ణుడు’ అవతారం ఎత్తేశాడు రోహిత్. మంగళవారం రోహిత్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు. ఈ పోస్టర్లో రోహిత్ సరికొత్తగా కనిపిస్తున్నాడు. జుట్టు బాగా పెంచి.. కండలు పెంచి.. సిక్స్ ప్యాక్ బాడీతో విభిన్నంగా దర్శనమిస్తున్నాడు.

కాకపోతే పోస్టర్లో చూపించిందంతా ఒరిజనలేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి జనాలకు. నారా రోహిత్ ఒకప్పుడు ఎంత బొద్దుగా ఉండేవాడో తెలిసిందే. ఈ విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొన్న రోహిత్.. ఈ మధ్యే కొంచెం బాడీ మీద దృష్టిపెట్టాడు. జిమ్‌లో కష్టపడి ఎక్స్‌ట్రా ఫాట్ తగ్గించుకునే ప్రయత్నం చేశాడు. ఈ మధ్య ‘శమంతకమణి’ ప్రమోషన్లలో రోహిత్ కొంచెం సన్నబడి కనిపించాడు. ఐతే బాడీ మరీ కండలు తిరిగిపోయినట్లు కానీ.. సిక్స్ ప్యాక్ వచ్చేసినట్లు కూడా ఫీలింగ్ ఏమీ కలగలేదు.

‘బాలకృష్ణుడు’ పోస్టర్ చూసినా అదేమీ సహజంగా అనిపించలేదు. ఏవో ఎఫెక్ట్స్ జోడించినట్లుగా అనిపిస్తోంది. తమిళ స్టార్ హీరో అజిత్ కొత్త సినిమా ‘వివేగం’ ఫస్ట్ లుక్‌కు సంబంధించి కూడా ఇలాంటి సందేహాలే కలిగాయి. వీఎఫెక్స్ లుక్ అంటూ దానిపై పెద్ద స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఐతే రోహిత్ ఇక్కడ పెద్ద స్టార్ కాదు కాబట్టి, అతడికి యాంటీ ఫ్యాన్స్ లేదు కాబట్టి దీనిపై పెద్ద చర్చేమీ లేదు కానీ.. సోషల్ మీడియాలో అయితే ఈ లుక్ విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్న మాట వాస్తవం. ఐతే సినిమాలో తన సిక్స్ ప్యాక్ లుక్ చూపించి రోహిత్ ఈ సందేహాలకు తెరదించుతాడేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English