డ్ర‌గ్స్ విచార‌ణ‌లో మ‌రో భారీ సంచ‌ల‌నం?

డ్ర‌గ్స్ విచార‌ణ‌లో మ‌రో భారీ సంచ‌ల‌నం?

సంచ‌ల‌నాల మీద సంచ‌ల‌నాలు న‌మోదవుతున్న తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి ఈ రోజు భారీ షాక్ త‌గ‌ల‌నుందా? అంటే అవున‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే డ్ర‌గ్స్ విచార‌ణ కేసులో సినీ రంగానికి చెందిన 12 మందికి సిట్ నోటీసులు జారీ చేయ‌టం.. ఇప్ప‌టికే ప‌లువురిని విచారించ‌టం తెలిసిందే. విచార‌ణ‌లో భాగంగా న‌టుడు సుబ్బ‌రాజు.. కెమేరామ‌న్ శ్యాం కె.నాయుడు వెల్ల‌డించిన స‌మాచారం ఆధారంగా చేసుకొని మ‌రో భారీ సంచ‌ల‌నానికి సిట్ అధికారులు తెర తీయ‌నున్న‌ట్లుగా స‌మాచారం.

విశ్వ‌స‌న‌యీ స‌మాచారం ప్ర‌కారం డ్ర‌గ్స్ వినియోగానికి సంబంధించి తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో మొద‌టి నుంచి హ‌వా ఉన్న మూడు కుటుంబాల‌కు చెందిన వారికి తాజాగా నోటీసులు అందే అవ‌కాశం ఉంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. డ్ర‌గ్స్ విచార‌ణ‌లో భాగంగా ఇప్ప‌టికే అందిన స‌మాచారం విచార‌ణ అధికారుల్ని నివ్వెరపోయేలా చేసింద‌ని చెబుతున్నారు.
విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ రోజు భారీ సంచ‌ల‌నంగా సిట్ అధికారులు నిర్ణయాలు తీసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో మూడు లేదా న‌లుగురు సినీ ప్ర‌ముఖుల‌కు నోటీసులు ఇవ్వ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు.

నోటీసులు అందుకునే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్న సినీ ప్ర‌ముఖుల విష‌యాన్ని ప‌రోక్షంగా చెబుతున్నారు. తాజాగా వినిపిస్తున్న‌వారి ఆన‌వాళ్లు ఏమంటే..

1. మాంచి ఊపు మీద ఉన్న యంగ్ హీరో ఒక‌రు

2. కుటుంబ క‌థ‌లు.. ఆట‌పాట‌ల‌తో ఉర్రూత‌లు ఊగించే హీరో మ‌రొక‌రు

3. వ‌రుస హిట్ల‌తో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న ఓ న‌టి

4. ఒక అగ్ర‌తార‌

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు