డైరెక్టర్‌కి లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చిన హీరో డాడీ

డైరెక్టర్‌కి లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ ఇచ్చిన హీరో డాడీ

రణ్‌భీర్‌ కపూర్‌ టైమ్‌ ఎంత బ్యాడ్‌గా నడుస్తుందంటే పాపం అతని కాంపిటీటర్లు కూడా తనకో హిట్టు పడితే బాగుండని కోరుకుంటున్నారు. టాలెంటెడ్‌ యాక్టర్‌ అయినా కానీ డిజాస్టర్ల మీద డిజాస్టర్లు ఇస్తోన్న రాజ్‌ కపూర్‌ మనవడు తన ఆశలన్నీ రాజ్‌కుమార్‌ హిరానీ మీదే పెట్టుకున్నాడు. సంజయ్‌ దత్‌ జీవిత కథతో రూపొందుతోన్న చిత్రం తనని ట్రాక్‌ మీదకి తెస్తుందని ఆశిస్తున్నాడు. ఇదిలావుంటే ఇటీవలే విడుదలైన రణ్‌భీర్‌ చిత్రం జగ్గా జాసూస్‌ షరా మామూలుగా డిజాస్టర్‌ అయింది.

దీనికి రణ్‌భీర్‌ సహనిర్మాత కూడా. అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు అనురాగ్‌ బసు విడుదలకి ముందు రోజు వరకు రణ్‌భీర్‌కి కూడా చూపించలేదట. తనకి బర్ఫీలాంటి సినిమా ఇచ్చిన దర్శకుడు కావడంతో అతడికి రణ్‌భీర్‌ ఎదురు చెప్పలేకపోయాడు. ఈ చిత్రం చూసిన రణ్‌భీర్‌ తండ్రి రిషి కపూర్‌ దాని గురించి మాట్లాడేందుకు కొన్ని రోజులు వేచి చూసాడు. ఇక సినిమా ఫ్లాప్‌ అనేది నిర్ధారించుకున్నాక బసుపై ధ్వజమెత్తాడు. సినిమా ఎలా వచ్చిందో కనీసం నిర్మాతకి కూడా చూపించరా అంటూ నిలదీసాడు.

ఒక ఇరవై నిమిషాల పాటు కుదించినట్టయితే ఇది ఇంకా బెటర్‌గా ఆడి వుండేదని, కానీ అసలు ఎవరి అభిప్రాయం తీసుకోకుండా, కనీసం తన కొడుకు అభిప్రాయం కూడా తెలుసుకోకుండా ఫైనల్‌ కట్‌ని సరిగ్గా ఒక రోజు ముందు రెడీ చేసి విడుదల చేసాడని, దీని వల్ల విదేశాల్లో పలు చోట్ల ప్రీమియర్స్‌ పడలేదని, కొన్ని దేశాల్లో విడుదల కూడా కాలేదని, దర్శకుడనేవాడికి ఇంత కండకావరం పనికి రాదని, వేరొకరు తమని నమ్మి డబ్బులు పెట్టినపుడు వారికి కనీస గౌరవం ఇవ్వాలని తిట్టి పోసాడు. రణ్‌భీర్‌ మాత్రం ఈ చిత్రంపై మూడేళ్లు పని చేసి రూపాయి ఆదాయం సంపాదించకపోగా, ఇంకా ఎదురు డబ్బులు పోగొట్టుకున్నాడు. అయినా కానీ దర్శకుడిని ఏమీ అనలేక సైలెంట్‌గా వుండిపోయాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు