అలా చేస్తే సంజయ్ దత్ ఊరుకుంటాడా?

అలా చేస్తే సంజయ్ దత్ ఊరుకుంటాడా?

ఒక మున్నాభాయ్ ఎంబీబీఎస్.. ఒక త్రీ ఇడియట్స్.. ఒక పీకే.. దర్శకుడిగా రాజ్ కుమార్ హిరాని స్థాయి ఏంటో ఈ సినిమాలే చెబుతాయి. మంచి చెబితే.. సందేశాలిస్తే ఎవరు చూస్తారు అనే వాళ్లకు సమాధానం ఈ సినిమాలు. వినోద ప్రధానంగా సినిమాలు తీస్తూనే జనాలకు ఎంతో మంచి చెప్పొచ్చు.. వాళ్లను ఆలోచింపజేయొచ్చు అనిపించేలా సినిమాలు తీశాడు రాజ్ కుమార్. ఆయన సినిమాల్ని జీవిత పాఠాల్లాగా చూడొచ్చనడంలో సందేహం లేదు. ఐతే ఇప్పటిదాకా ఒక తరహా సినిమాలు చేసిన రాజ్ కుమార్ హిరాని.. ఇప్పుడు వాటికి పూర్తి భిన్నమైన సినిమా చేస్తున్నాడు. తన మిత్రుడు సంజయ్ దత్ జీవిత కథతో సినిమా తెరకెక్కిస్తున్నాడు.

తన ప్రతి సినిమాతోనూ ఎంతో కొంత మంచి చెబుతూ.. ప్రేక్షకుల్లో ఆలోచన రేకెత్తించిన రాజ్ కుమార్.. ఇప్పుడూ సంజూ జీవిత కథతో ఏం చెప్పబోతున్నాడన్నది జనాలకు అర్థం కావడం లేదు. సంజయ్ ఏంటన్నది జనాలకు ఇప్పటికే ఓ అభిప్రాయం ఉంది. అతను చాలా పెద్ద నేరాలు చేశాడు. జైలు శిక్ష కూడా అనుభవించాడు. మరి తన మిత్రుడు కాబట్టి సంజయ్ గురించి రాజ్ కుమార్ గొప్పగా చూపిస్తాడేమో అన్న సందేహాలున్నాయి. నిజాల్ని కప్పెట్టేసి.. అతడి సంజూ జీవితానికి పాజిటివ్ పూత వేస్తాడేమో అని అంచనా వేస్తున్నారు బాలీవుడ్ జనాలు.

ఐతే ఈ సినిమా అలా ఉండదని అంటున్నాడు సంజయ్ దత్ పాత్రధారి రణబీర్ కపూర్. సంజూను ఇందులో దేవుడిలాగా చూపించట్లేదని.. అతడి జీవితంలోని మంచి చెడులు రెంటినీ చూపిస్తున్నామని అతను చెప్పాడు. సంజూతో ఈ విషయాలన్నీ ముందే రాజ్ కుమార్ చర్చించాడని.. ఇందులో వాస్తవాలు మాత్రమే చూపిస్తాడని అతనన్నాడు.కాీనీ ముంబయి దాడులకు ముందు మాఫియా డాన్లను కలవడం.. వాళ్లతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం.. వాళ్ల కోసం తన దగ్గర మారణాయుధాలు అట్టి పెట్టడం.. ఓ దశలో డ్రగ్స్‌కు బానిస కావడం.. జైలు శిక్ష పడ్డాక కుంటి సాకులతో పలుమార్లు పెరోల్ పొొందడం.. దాన్ని పొడిగించుకునే ప్రయత్నాలు చేయడం.. జైల్లో మంచి సౌకర్యాలు పొందడం.. ఇలాంటివన్నీ ఉన్నదున్నట్లు రాజ్ కుమార్ సినిమాలో చూపించే సాహసం చేస్తాడా..? అలా చేస్తే సంజయ్ దత్ ఊరుకుంటాడా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు